మెంతులు చేసే మేలు… ప్రయోజనాలెన్నో తెలుసా?

ప్రొటీన్‌ అంటే మనకి మాంసం, గుడ్లు, కందిపప్పు, చేపలు వంటివే చటుక్కున గుర్తుకొస్తాయి. అందుకే జిమ్‌కెళ్లేవాళ్లూ, వ్యాయామాలు చేసేవారు కూడా ఆరోగ్యకరమైన ప్రొటీన్‌ కోసం వీటినే ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ, ఆశ్చర్యకరంగా కండబలం కోసం మెంతుల్లోని ప్రొటీన్‌ వీటన్నింటి కంటే ఎక్కువ మేలు చేస్తుందని అంటోంది ఫుడ్‌ సైన్స్‌ జర్నల్‌ కథనం.


మెంతి గింజల్లో పుష్కలంగా ఉండే ప్రొటీన్, పీచు, మెగ్నీషియంల సమ్మేళనం కండబలానికి ఎంతగానో సహకరిస్తుందట. వ్యాయామం చేసిన తర్వాత అలసి, గాయపడిన కండరాలు రిలాక్స్‌ అవ్వాలన్నా, గాయాల నుంచి తిరిగి వేగంగా కోలుకోవాలన్నా మెంతులు ఎంతగానో సహకరిస్తాయట. అలాగే, మెంతుల్లోని అమైనో ఆమ్లాలు కండరాల నియంత్రణకు ఉపయోగపడతాయట.

బాలింతలు మెంతులతో చేసిన టీని తాగడం వల్ల పిల్లలకు పాలు సమృద్ధిగా అందుతాయనీ, వాళ్ల బరువు కూడా తగినంతగా ఉండి, ఆరోగ్యంగా ఎదుగుతారనీ పరిశోధకులు అంటున్నారు. మెంతులు చేదుగా ఉండే మాట నిజమే అయినా తాలింపులూ, పచ్చళ్ల రూపంలో వీటిని చేర్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చన్నమాట.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.