తెలుగు సినీప్రియులను ఒకే ఒక్క సినిమాతో కట్టిపడేసింది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. అతి తక్కువ సమయంలోనే అడియన్స్ హృదయాలు గెలుచుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
దక్షిణాదిలో తొలి సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న పలువురు ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ అమ్మడు ఒకరు. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? అదెనండీ.. అక్కినేని నాగార్జున నటించిన గీతాంజలి మూవీ హీరోయిన్ గిరిజా షెత్తార్. ఈ సినిమాతో తెలుగులో ఆమె స్టార్ డమ్ సంపాదించుకుంది. అప్పట్లో గీతాంజలి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని సాంగ్స్ సైతం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. ఇక ఇందులో నాగార్జున, గిరిజా షెత్తర్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.
గిరిజా షెత్తార్ 1969 జూలై 20న జన్మించారు. డైరెక్టర్ మణిరత్నం ఇంగ్లాండ్ నుంచి ఆమెను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీతో ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకుంది. ఈ సినిమాతో ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడుకు ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. కేవలం గీతాంజలి సినిమాలోనే నటించింది గిరిజా.
ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న గిరిజా.. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2003లో చివరిగా హిందీలో తూజే మేరి కసమ్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్టులో నటించింది. ఇక ఇటీవలే రక్షిత్ శెట్టికి సంబంధించిన పరమవ స్టూడియోస్ నిర్మించిన బ్బని తబ్బిడ ల్లెలి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. పెళ్లి తర్వాత బ్రిటన్లో జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగింది.
































