సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాల్లోని ఐఏఎస్ అధికారులు వారానికి రెండు పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన మేర గదులను నిర్మించాలని సూచించారు. అంతే కాకుండా స్కూళ్లలో సోలార్ కిచెన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పదోతరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఇంటర్మీడియట్లో చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
వేసవి సెలవుల తరవాత ఇటీవలే రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని అనేకసార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.































