భూమి ఎండ్ అయ్యేది ఇక్కడే.. అద్భుతమైన దృశ్యం చూసి తరించాల్సిందే.

అసలు భూమి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? భూమి ఆకాశం ఎక్కడ కలుస్తాయి? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. కానీ భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ అనేది లేదని చెప్తుంటారు నిపుణులు.


అయితే ఆస్ట్రేలియాలోని ఓ ప్రాంతాన్ని మాత్రం భూమికి అంచుగా.. ఎండ్‌ ఆఫ్ ది ఎర్త్‌గా పరిగణిస్తారు. ఇందుకు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం.

నుల్లార్బోర్ క్లిఫ్స్ (బుండా క్లిఫ్స్)ను భూమికి చివరగా ట్రీట్ చేస్తారు కొందరు. కానీ ఇది ఆకట్టుకునే ఒక భౌగోళిక లక్షణం మాత్రమే. కాగా ఇలా అనిపించేందుకు కారణం కూడా లేకపోలేదు. 200 కిలోమీటర్ల పొడవైన ఈ సున్నపురాయి కొండలు ఆస్ట్రేలియా దక్షిణ చివరన గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ సముద్ర కొండలు… వాటి ఎత్తైన అంచులు, విశాలమైన సముద్ర దృశ్యం భూమి యొక్క అంచు అనే భావనను కలిగిస్తాయి. కానీ వాస్తవానికి అవి ఆస్ట్రేలియా ఖండంలోని ఒక భాగం మాత్రమే. భౌగోళికంగా భూమి గోళాకారంలో ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైన చివర ఉండదు. నుల్లార్బోర్ క్లిఫ్స్ వంటి ప్రదేశాలు భూమి యొక్క వైవిధ్యమైన, అద్భుతమైన భౌగోళిక లక్షణాలను మాత్రమే ప్రదర్శిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.