ఏపీలో గృహ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. మిస్ చేసుకోకండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగదారులకు apcpdcl సువర్ణావకాశం ఇచ్చింది. ఎవరైతే విద్యుత్ ఎక్కువగా వినియోగిస్తున్నారో వారికి విద్యుత్ అదనపు లోడును క్రమబద్ధీకరించు కోవడానికి బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.


విద్యుత్ సర్వీస్ కు అధిక లోడు ఉంటే, కరెంట్ బిల్ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాలని apcpdcl ఒక ప్రకటనలో పేర్కొంది.

గృహ విద్యుత్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

అయితే ఈ బంపర్ ఆఫర్ ను వినియోగించుకోవడానికి జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని, ఈలోపు ఎవరైతే వినియోగదారులు అదనపు లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటారో, దానికి సంబంధించి సంబంధిత రుసుమును చెల్లిస్తారో, వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. apcpdcl అందిస్తున్న ఈ ఆఫర్లో అదనపు విద్యుత్ లోడ్ ఒక కిలోవాట్ కు 50% రాయితీని అందిస్తుంది.

కిలోవాట్ల ప్రకారం రాయితీ ఇలా

పాత ధర ప్రకారం ఒక కిలోవాట్ విద్యుత్ అదనంగా వినియోగిస్తే 2250 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 50% రాయితీ ఇస్తున్న క్రమంలో 1250 రూపాయలు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తారు. రెండు కిలోవాట్లు అయితే 4450 పాత ధర కాగా 2450 రూపాయలు కొత్త ధరగా ఉంది. మూడు కిలోవాట్ల విద్యుత్ అదనపు లోడ్ అయితే 6650 పాత ధర కాగా ప్రస్తుతం రాయితీ ప్రకారం 3650 చెల్లించాల్సి ఉంటుంది.

జూన్ 30 లోపే బంపర్ ఆఫర్

4 వేల కిలోవాట్ల అదనపు లోడ్ కు 8850 పాత ధర కాగా 4850 ప్రస్తుతం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఐదు వేల కిలోవాట్ వరకు అదనపు లోడును పెంచుకుంటే 11,050 పాత ధర చెల్లించాల్సి ఉంటే 6050 రూపాయలు కొత్త ధరగా ఉంది. ఎవరైతే విద్యుత్ సర్వీస్ కు ఉన్న అధిక లోడ్ ను క్రమబద్ధీకరించాలని భావిస్తున్నారో వారు జూన్ 30వ తేదీ లోపు క్రమబద్దీకరించుకోవాలి.

ఎక్కువ విద్యుత్ వాడకం ఉంటే అలెర్ట్

వినియోగదారులు apcpdcl సర్కిల్స్ లోని సమీప ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ లేదా సమీపంలోని ఈ సేవ కేంద్రాలలో లేదా ఏపీసీపీడీసీఎల్ వెబ్సైట్లో మీకు కావలసిన లోడుకు తగిన చార్జీలు చెల్లించి అదనపు లోడ్ ను క్రమబద్ధీకరించుకోవాలని apcpdcl సూచిస్తుంది. ఈ అవకాశం ఈనెల 30వ తేదీ వరకు కావడంతో విద్యుత్ వినియోగదారులు ఎక్కువ విద్యుత్ వాడకం నేపథ్యంలో అధిక లోడ్ ను క్రమబద్ధీకరించుకుంటే మంచిదని చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.