కాబోయే అల్లుడిపై నాగబాబాబు కీలక ప్రకటన

మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆమె విడాకులపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందకపోయినా, ఆమె వ్యక్తిగత జీవితంపై మాత్రం అభిమానులకు ఆసక్తి ఎక్కువే.


పెళ్లి, విడాకుల విషయంలో నిహారికపై వచ్చిన ట్రోలింగ్‌ల గురించి ఆమె పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా, ఈ విషయంపై ఆమె తండ్రి నాగబాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.

నిహారిక పెళ్లి విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అంగీకరించారు. “మేము వారిని సరిగా అంచనా వేయలేకపోయాము. వారికి సింక్ అవ్వలేదు. మ్యూచువల్‌గా ఇద్దరూ విడిపోయారు” అని ఆయన తెలిపారు. నిహారిక పెళ్లి విషయంలో అబ్బాయిని చూపించింది తామే అయినా, అది ఆమె సొంత ఇష్టం కాదని, తమ మద్దతుతో చేయలేదని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు… వారు జీవితాంతం కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ల జడ్జిమెంట్. వాళ్లు వద్దనుకున్నారు… విడిపోయారని నాగబాబు పేర్కొన్నారు. వారిద్దరి బంధంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, విడిపోవాలనే నిహారిక నిర్ణయాన్ని తాను అంగీకరించానని చెప్పారు. నిహారిక అడిగింది. ఆమె విడిపోతాను అంది. ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగానే విడిపోయారని నాగబాబు వివరించారు.

పిల్లల విషయాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, భవిష్యత్తులో కూడా చేసుకోనని నాగబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం నిహారిక తన ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, భవిష్యత్తులో ఆమె మరొకరిని కలుసుకుని పెళ్లి చేసుకుంటుందని, తన రెండో పెళ్లి విషయంలో తన జోక్యం ఉండబోదని, నిహారిక ఎవర్ని ఇష్టపడినా నాకు ఇష్టమే అని నాగబాబు చెప్పుకొచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.