ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉన్న దేశం ఏదో తెలుసా?

ముస్లింలు ప్రార్థనలు చేయడానికి,అల్లాను ఆరాధించడానికి ఉపయోగించే పవిత్ర స్థలం మసీదు. ఇస్లాం మతంలో ఇవి చాలా ముఖ్యమైనవి. మసీదులు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాకుండా ముస్లింల సామాజిక జీవితంలోనూ చాలా కీలక పాత్ర పోషిస్తాయి.


ఇక్కడ సమావేశాలు, వివాహాలు, అంత్యక్రియల ప్రార్థనలు, ఛారిటీ కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తారు. ముస్లింలు రోజుకు ఐదుసార్లు సలాత్ (ప్రార్థన) చేస్తారు. ఈ ప్రార్థనలు సాధారణంగా ఇంట్లో చేసినా మసీదులో సామూహికంగా చేయడం మరింత పుణ్యం అని నమ్ముతారు. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం చేసే జుమా ప్రార్థనలు మసీదులోనే చేయాలి.

మసీదులు ఇస్లామిక్ విద్యను అందించే కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. ఖురాన్ పఠనం, ప్రవక్త ముహమ్మద్ బోధనలు, ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటివి ఇక్కడ బోధిస్తారు. ప్రపంచంలో అనేక ముస్లిం దేశాలు ఉన్నాయి..అక్కడ మసీదులు ఉండటం సహజమే. ముస్లింలు మెజార్టీగా లేని దేశాల్లో కూడా పెద్ద స్థాయిలో మసీదులో ఉన్నాయి. అయితే ప్రపంచంలో అత్యధికంగా మసీదులు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? చాలా మంది ఈ ప్రశ్నకు పాకిస్తాన్ అని లేదా సౌదీ అరేబియా లేని లేదా ఇరాన్ అంటూ సమాధానం చెప్పేస్తుంటారు. వాస్తవానికి అత్యధిక మసీదులు ఉన్న దేశం ఏదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి.

అత్యధికంగా మసీదులు ఉన్న దేశం ఇదే

సౌదీ అరేబియా

ప్రపంచంలో ఎక్కువగా మసీదులు ఉన్న దేశాల జాబితాలో 5వ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. ఈ దేశం పవిత్ర ఇస్లామిక్ ప్రార్థనా స్థలాలకు ఇళ్లుగా భావించబడుతుంది. ఈ దేశంలో 94వేలకు పైగా మసీదులు ఉన్నాయి. ఈ దేశంలోనే మక్కా సిటీలో ఇస్లాం మతానికి చెందిన పవిత్ర స్థలం కాబా ఉంది. ఇది ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రదేశం. కాబా చుట్టూ ముస్లింలు ప్రదక్షిణలు చేస్తారు. మక్కాలోని ప్రపంచంలోని అతిపెద్ద మసీదుగా పిలువబడే మసీద్ అల్ హరామ్ లో ఈ కాబా ఉంది. కాబాను దేవుడి గృహంగా పరిగణిస్తారు. కాబాలో ఉండే నల్లరాయిని ముస్లింలు పవిత్రంగా భావించి తాకి ముద్దు పెట్టుకోవడం ఒక ఆచారం.

టర్కీ

భారత్ ఎన్నిసార్లు సాయం అందించినా దాన్ని మరిచి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు సాయమందించి భారత్ ఆగ్రహానికి గురైన టర్కీ దేశవ్యాప్తంగా 82,600 మసీదులు ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మసీదులు ఉన్న 4వ దేశంగా పాక్ నిలిచింది.

పాకిస్తాన్

అమెరికా,చైనా వంటి దేశాల చేతిలో టిష్యూ పేపర్ గా మారిపోయిన మన పొరుగుదేశం పాకిస్తాన్ లో దాదాపు 3 లక్షల మసీదులు ఉన్నాయి. దేశంలోని ప్రతి టౌన్ లో,గ్రామంలో మసీదులు ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మసీదులు ఉన్న 3వ దేశంగా పాక్ నిలిచింది.

భారత్

ఇండియాలో హిందూ జనాభా అధికశాతం అయినప్పటికీ పరమత సహనం కలిగిన దేశం కాబట్టి ఇక్కడ మసీదులకు కొదవే లేదు. ముస్లిం మెజార్టీ దేశాల్లో కూడా లేని విధంగా మనదేశంలో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మసీదులు ఉన్నాయని అంచనా. ముస్లింయేతర దేశాల్లో ఎక్కువగా మసీదులు ఉన్న మొదటి దేశం ఇండియానే. మసీదులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది 2వ స్థానంలో ఉంది.

ఇండోనేషియా

8 లక్షలకు పైగా మసీదులతో ప్రపంచంలో అత్యధికంగా మసీదులు ఉన్న దేశం ఇండోనేషియా. ఈ దేశంలో 97శాతం ముస్లిం జనాభానే. అయినప్పటికే కొన్నేళ్ల క్రితం ఈ దేశ కరెన్సీపై హిందూ దేవుడైన గణేషుడి చిత్రం ఉండేది. అయితే 2008లో అది ఉపసంహరించబడింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.