వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసే ర్యాలీలు, బల ప్రదర్శనలను నిషేధించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోలీసుల సూచనలను పాటించకుండా జగన్ తప్పు చేశారన్నారు.
ఇటీవల పల్నాడులో జగన్‌తో కరచాలనం చేసేందుకు వచ్చి ఓ వృద్ధుడు కారు కింద పడ్డాడని.. అయినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లారని ఆమె మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా పక్కకు లాగి ర్యాలీగా వెళ్లారన్నారు. సొంత పార్టీ కార్యకర్తపైనా మానవత్వం లేకుండా వ్యవహరించారంటూ షర్మిల ఆక్షేపించారు.
































