ఇండియాలో కూడా ఈ పాస్ పోర్ట్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో తెలుసా

 పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2.0 దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇది అధునాతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను కలిగి ఉంటుంది. ఈ-పాస్‌పోర్టులో కాంటాక్ట్‌లెస్ చిప్-ఆధారిత టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా, సులభంగా అయిపోతుందని మంత్రి పేర్కొన్నారు..

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా ఇప్పటికే పాస్‌పోర్ట్ ఉన్న వాళ్లకు తరచుగా సేవలు, రూల్స్, అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను మరింత వేగవంతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ సేవల్లో అనేక కొత్త మార్పులు, సాంకేతిక ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు ప్రయాణీకులకు ఎలాంటి సౌలభ్యాన్ని కల్పిస్తాయి.


పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారతదేశంలోనూ, అంతర్జాతీయంగానూ పాస్‌పోర్ట్ అధికారుల అంకితభావాన్ని కొనియాడారు. అంతేకాకుండా, పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ లో భాగంగా ఈ-పాస్‌పోర్ట్‌లను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2.0 దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇది అధునాతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను కలిగి ఉంటుంది. ఈ-పాస్‌పోర్టులో కాంటాక్ట్‌లెస్ చిప్-ఆధారిత టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగంగా, సులభంగా అయిపోతుందని మంత్రి పేర్కొన్నారు. mPassport పోలీస్ యాప్ పరిచయంతో 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పోలీస్ వెరిఫికేషన్ సమయం కేవలం 5-7 రోజులకు తగ్గిందని చెప్పారు.

భారతదేశంలో ఈ-పాస్‌పోర్ట్ ముఖ్య ప్రయోజనాలు:
1. ఎంబెడెడ్ సెక్యూర్ చిప్: పాస్‌పోర్ట్ ముందు కవర్‌లో ఒక మైక్రోచిప్ ఉంటుంది. ఇది ముఖ్యమైన డేటాను సేఫ్ గా స్టోర్ చేస్తుంది.
2. బయోమెట్రిక్ వివరాలు: వేలిముద్రలు, ఫోటో, ఐరిస్ స్కాన్‌లు డిజిటల్‌గా స్టోర్ చేయబడతాయి.
3. పర్సనల్ డేటా: పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ ఐడి, ఇతర ముఖ్యమైన సమాచారం ఇందులో ఉంటుంది.
4. కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీ: చిప్‌ను ఫిజికల్ టచ్ లేకుండానే చదవవచ్చు, తద్వారా త్వరగా సమాచారాన్ని పొందవచ్చు.
5. ICAO ప్రమాణాలకు అనుగుణంగా: అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రపంచ ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉంటుంది.
6. మెరుగైన భద్రత: నకిలీ లేదా డూప్లికేషన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

భారతదేశంలో ఈ-పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
అధికారిక పాస్‌పోర్ట్ సేవా ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ-పాస్‌పోర్ట్‌ను పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
1. పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను సందర్శించండి: భారత ప్రభుత్వం నిర్వహించే అధికారిక వెబ్ సైట్ కు passportindia.gov.in వెళ్లాలి.
2. రిజిస్టర్ లేదా సైన్ ఇన్ చేయండి: మీరు కొత్త యూజర్ అయితే, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పటికే అకౌంట్ తమ వివరాలతో లాగిన్ అవ్వండి.
3. ఈ-పాస్‌పోర్ట్ దరఖాస్తును నింపండి: ఆన్‌లైన్ ఫారమ్‌ను సరైన పర్సనల్, ట్రావెల్ సమాచారంతో పూర్తి చేయాలి.
4. సర్వీస్ సెంటర్ ఎంచుకోండి: మీకు దగ్గరగా ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
5. పేమెంట్ : అందుబాటులో ఉన్న పేమెంట్స్ పద్ధతుల ద్వారా ఈ-పాస్‌పోర్ట్ రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
6. అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి: ఎంచుకున్న సేవా కేంద్రాన్ని సందర్శించడానికి ఒక తేదీ బుక్ చేసుకోవాలి.
7. అపాయింట్‌మెంట్‌కు హాజరు అవ్వండి: షెడ్యూల్ చేసిన సమయానికి PSK లేదా POPSKని సందర్శించి, బయోమెట్రిక్ క్యాప్చర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.