చాలామందికి కార్లలో ప్రయాణించడం కంటే బైక్పై రైడింగ్ చేయడం అంటేనే ఇష్టం. అందుకే కొందరు డబ్బున్న వారు సైతం బైక్ను కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ఖరీదైన బైకులను మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. అయితే మిడిల్ క్లాస్ తో పాటు హై క్లాస్ వారికి నచ్చే విధంగా బజాజ్ కంపెనీ ‘పల్సర్ ‘ బైక్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైలేజ్ విషయం పక్కన పెడితే ఈ బైక్ స్టైల్ గా ఉండడంతో పాటు దీనిపై రైడింగ్ చేస్తే ఆ వ్యక్తి ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతాడు. అందుకే ఇది మార్కెట్లోకి వచ్చినా కొద్ది కాలానికి ఎక్కువగా విక్రయాలు జరుపుకుంది. అయితే పల్సర్ కు పోటీగా అనేక వాహనాలు మార్కెట్ లోకి వచ్చాయి. దీంతో పల్సర్ అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. 2025 మే నెలలో పల్సర్ బైక్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం మార్కెట్లో పల్సర్ బైక్ ధరలు ఎలా ఉన్నాయి?
బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ బైక్ 2001 లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి రకరకాల మోడల్స్ను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పల్సర్ 125, 150, 160, 200 సీసీల బైకు లు ఎక్కువగా ఆదరణ పొందాయి. వీటిలో పల్సర్ ఎస్ఎస్ 125, పల్సర్ ఎన్ఎస్ 160 మరీ ఎక్కువగా అమ్ముడుపోయాయి. పల్సర్ బైక్ 125 సిసి రూ. 1.04 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.1.15 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఇది లీటర్ పెట్రోల్ కు 51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. బజాజ్ పల్సర్ 160 ప్రస్తుతం మార్కెట్లో లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 1.71 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ బైక్ లీటర్కు 59 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని అంటున్నారు.
2025 మే నెల అమ్మకాల్లో విడుదలైన జాబితాలో టాప్ టెన్ లిస్టులో పల్సర్ బైక్ కూడా ఉంది. అయితే ఎప్పటికీ నెంబర్ వన్ స్థానంలో ఉండే ఈ బైక్ ఈసారి మూడో స్థానానికి దిగింది. ఇందులో మొదటి స్థానంలో హీరో స్ప్లెండర్ ఉండగా.. రెండో స్థానంలో హోండా షైన్ ఉంది. అయితే పల్సర్ బైక్ అమ్మకాలు తగ్గడానికి కారణాలు ఏంటి అనేది కంపెనీ ప్రత్యేకంగా చెప్పడం లేదు. కానీ వీటి ధరలు అధికంగా ఉండడంతో పాటు.. ఈ బైక్ లకు పోటీగా ఇతర కంపెనీలు మార్కెట్లోకి తీసుకురావడంతోనే వీటి కొనుగోలు పై వెనకాడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా పల్సర్ ఇదివరకే చాలామంది వాడేశారు. ఆకర్షణీయమైన బైక్ కొనాలని అనుకునేవారు కొత్త బైక్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మిడిల్ క్లాస్ పీపుల్స్ మైలేజ్ విషయాన్నీ బాగా ఆలోచించి పల్సర్ బైక్ ను దూరంగా పెడుతున్నారు. ఈ క్రమంలో ఈ బైక్ అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని బైకుల్లో మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకువస్తామని.. అప్పుడు అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
































