తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం.
ఇక ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన పాలిటిక్స్ లో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇకమీదట ఫుల్ టైం పొలిటిషన్ గా మారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సినిమాలను సైతం పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉంది. మూడు సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకి పరిమితం అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తమిళనాడులో నిర్వహించిన ‘మురుగన్ భక్తర్గల్ మానాడు’ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇక ఆయన అక్కడికి వెళ్లి దేవుడి గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. తమిళనాడులో ఎక్కువగా దేవుడిని నమ్మని వ్యక్తులు ఉన్నారు… పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ గా సినిమా నటుడు సత్యరాజ్ (కట్టప్ప) స్పందిస్తూ దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటే తమిళనాడు ప్రజలు మీ మాటలు నమ్మే అంత అమాయకపు వ్యక్తులైతే కాదు అంటూ ఆయన పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ ఇచ్చాడు.ఇక దానికి పవన్ కళ్యాణతను అభిమానిస్తున్నాం అని చెప్పే ఏ ఒక్క సినిమా నటుడు గాని దర్శకులు గానీ సత్య రాజ్ కి కౌంటర్ అయితే ఇవ్వలేకపోయారు.
ఇండస్ట్రీకి కష్టం వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ కావాలి. కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు అంటూ కొంతమంది సినిమా మేధావులు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్నవాళ్ళు విమర్శిస్తున్నారు.
సత్య రాజ్ అనే నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకొని పాన్ ఇండియా నటుడుగా మారాడు. అలాంటి నటుడుకి కౌంటర్ ఇచ్చేవారు ఎవరు లేరా అనే ధోరణిలో కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthad Bhagath Sing) సినిమాలో అతను ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన ఆ కామెంట్స్ చేసిన వెంటనే హరీష్ శంకర్ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అతన్ని ఆ క్యారెక్టర్ నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది… హరీష్ శంకర్ ఒక్కడికే పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం ఉందని అందరూ అనుకుంటున్నారు.
































