మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు గురించి తెలిసిన విషయమే. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఇద్దరు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకునే వరకు వెళ్లింది పరిస్థితి.
తర్వాత మంచు విష్ణుపై కూడా మనోజ్ విమర్శలు చేశారు. ఆ మధ్య మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా డైలాగ్‌పై కూడా మనోజ్ సెటైర్ వేశాడు. అలాగే ఆ సినిమాకు పోటీగా తాను నటించిన సినిమాను విడుదల చేయడానికి సన్నద్ధం అయ్యారు మనోజ్. ఇదే సమయంలో కన్నప్ప సినిమా మొత్తం ఉన్న పెన్‌డ్రైవ్ కనిపించలేదు. దీని వెనుక మనోజ్ హస్తం ఉందని ఆరోపణలు కూడా వినిపించాయి.
ఇటువంటి తరుణంలో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కన్నప్ప సినిమా రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”కన్నప్ప చిత్ర బృందానికి నా తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం మా నాన్న (మోహన్ బాబు), టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను ప్రేమను పెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను ప్రార్థిస్తున్నాను. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.
మంచి మనసున్న ప్రభాస్ (Prabhas), లెజెండరీ నటులు మోహన్ లాల్ (Mohanlal) గారు, అక్షయ్ కుమార్ (Akshay Kumar) గారు, ప్రభుదేవా గారు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే తనికెళ్ల భరణి గారి జీవితకాలం కల జీవం పోసుకుని, శుక్రవారం జూన్ 27న ‘కన్నప్ప’ విడుదల అవుతుండటం సంతోషంగా అనిపిస్తుంది. వీళ్లంతా ఈ మూవీ కోసం చేసిన సాయం, చూపించిన ప్రేమ నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా” అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.అయితే తన ట్విట్‌లో ఎక్కడా కూడా తన అన్న విష్ణు ప్రస్తావనను ఆయన తీసుకురాలేదు.
































