Friday Ott Releases: థియేటర్లలో కన్నప్ప.. ఓటీటీల్లో ఒక్క రోజే 12 చిత్రాలు

 శుక్రవారం థియేటర్లలో టాలీవుడ్ బిగ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప సందడి చేయనుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27, 2025 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.


ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నుంచి కాజోల్ హారర్ థ్రిల్లర్ మా, నికిత రాయ్ అండ్ ది బుక్‌ ఆఫ్ డార్క్‌నెస్‌, కోలీవుడ్ నుంచి విజయ్ ఆంటోనీ మార్గన్‌, లవ్ మ్యారేజ్, ఎం3గన్‌ 2.0, మలయాళం నుంచి కూడల్ అనే చిత్రాలు బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి.

ఇక థియేటర్ల సంగతి పక్కనపెడితే శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ ప్రియులకు పండగే. ఈ వీకెండ్‌లో ఫుల్ వినోదం అందించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు విరాటపాలెం (తెలుగు సిరీస్), ఒక పథకం ప్రకారం మూవీ టాలీవుడ్‌ ప్రియులకు అలరించేందకు వచ్చేస్తున్నాయి. అంతేకాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఒక్క రోజులోనే దాదాపు 12కు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ లిస్ట్‌ మీరు కూడా చూసేయండి.

నెట్‌ఫ్లిక్స్

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 27
పొకేమాన్ హారిజన్స్- సీజన్-2 – జూన్ 27

జియో హాట్‌స్టార్

మిస్త్రీ (హిందీ సిరీస్) – జూన్ 27

జీ5

విరాటపాలెం (తెలుగు సిరీస్) – జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ సిరీస్) – జూన్ 27

అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) – జూన్ 28

సన్ నెక్స్ట్

అజాదీ (తమిళ సినిమా) – జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) – జూన్ 27

ఆప్ కైసే హో- జూన్ 27

నిమ్మ వస్తుగలిగే నీవే జవాబ్దారు(కన్నడ సినిమా)- జూన్ 27

ఆపిల్ ప్లస్ టీవీ

స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27

లయన్స్ గేట్ ప్లే

క్లీనర్- జూన్ 27

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.