పూరీ రథయాత్ర అంటే భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సాహం, శ్రద్ధ, సంప్రదాయాల కలయిక. ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా ఒడిశా రాష్ట్రం పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం వద్ద ఈ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది.
అయితే 2025 రథయాత్ర మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒడిశా ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంతేకాదు, ఈసారి ఆచార, సంప్రదాయాల ప్రాముఖ్యత మరింత వెలుగులోకి వచ్చింది.
భక్తుల సందడితో నిండిన పూరీ నగరం
రథయాత్ర సందర్భంగా పూరీ పట్టణం భక్తులతో కిటకిటలాడుతోంది. జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్ర దేవి మూడు భవ్య రథాల్లో ఊరేగుతారు. ఈ విశిష్ట ఉత్సవం ఆషాఢ మాసం, శుక్ల పక్ష ద్వితీయ తిథిన ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. భక్తి, సమానత్వం, సాంస్కృతిక ఐక్యతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.
2025 జూన్ 27 – నేటి ఆచారాల షెడ్యూల్
మంగళారతి: ఉదయం 6:00
మైలం, తడపలాగి, రోష్ హోమం: ఉదయం 6:10 – 6:30
అబకాష్, సూర్య పూజ: ఉదయం 7:00 – 7:10
ద్వారపాల పూజ, వేషం ముగింపు: ఉదయం 7:30
గోపాల బల్లవ్, ఉదయ ధూప భోగ్: ఉదయం 8:00 – 9:00
రథపవి, మంగళార్పణం: ఉదయం 9:00 – 9:15
పహండి ప్రారంభం – ముగింపు: ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:30
శ్రీ మదన మోహన బిజె, శ్రీరామ-కృష్ణ బిజె: మధ్యాహ్నం 12:30 – 1:00
చితా లాగి, వేషం ముగింపు: మధ్యాహ్నం 1:30 – 2:00
చ్హేరా పహన్రా (రథ శుభ్రపరిచే కార్యక్రమం): మధ్యాహ్నం 2:30 – 3:30
రథాల లాగుడు ప్రారంభం: సాయంత్రం 4:00
ఆధ్యాత్మికతను చాటి చెప్పే పూరీ రథయాత్ర
పూరీ రథయాత్ర ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప ఉత్సవం. జగన్నాథ స్వామి ఆలయం నుండి భక్తులను కలవడానికి బయటికి రావడం స్వర్గం నుండి భూమికి ఆత్మార్పణగా భావించబడుతుంది. ఇది కేవలం హిందూ మతానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది సమానత్వాన్ని, సమాజంలో ఐక్యతను సూచించే గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
ప్రతి ఒక్కరు – ఏ కులమైనా, వర్గమైనా – ఈ రథయాత్రలో పాల్గొనవచ్చు. చ్హేరా పహన్రా అనే సంప్రదాయంలో పూరీ గజపతి రాజు స్వయంగా బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేస్తారు. ఇది దేవుని ముందు అందరూ సమానమే అనే భావనను బలపరుస్తుంది. స్కంద పురాణం ప్రకారం, ఈ యాత్రలో పాల్గొంటే పాపాలు తొలగి మోక్షం పొందుతారని విశ్వాసం.
విశిష్టమైన రోజులు మరియు రథయాత్రకు ముందుఆచారాలు
అక్షయ తృతీయ (ఏప్రిల్ 30, 2025): ఈ రోజున రథాల నిర్మాణం ప్రారంభమవుతుంది
స్నాన పూర్ణిమ (జూన్ 11, 2025): దేవతల్ని 108 కుండల పవిత్ర జలంతో స్నాన చేయిస్తారు – దీనిని స్నానయాత్ర అంటారు
అనవసర దినాలు (జూన్ 13-26, 2025): స్నాన యాత్ర అనంతరం, దేవతలు అనారోగ్యంతో ఉన్నట్టు భావించి, 15 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వరూ
ఈ విధంగా పూరీ రథయాత్ర 2025 ఉత్సవం సాంప్రదాయం, ఆధ్యాత్మికత, మరియు సామాజిక ఐక్యతకు మారుపేరుగా నిలుస్తోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ వైభవాన్ని తిలకించేందుకు వచ్చారు.
మీరు కూడా ఒకసారి ఈ మహా ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఉంటే, రథయాత్ర రోజులలో పూరీకి వెళ్లే యాత్రను జీవితంలో ఒకసారి అయినా తప్పకుండా అనుభవించండి.































