ఏపీలో పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచి జులై నెల రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది.
జులై నెల రేషన్‌ను 4 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీ సైతం చేయాలని ప్రభుత్వ నిర్ణయం. తీసుకుంది. జూన్ నెలలో సమస్య దృష్ట్యా ముందుగానే డోర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే గత నెలలో సమాచార లోపం వల్ల వృద్ధులు రేషన్ డిపోలకు వచ్చారని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక పింఛను ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రస్తావించారు.
జూన్ నుంచి స్పౌజ్ పింఛన్లు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల నుంచి స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వీరికి ప్రతినెల రూ.4000 పెన్షన్ ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్న సందర్భంగా కొత్తగా 71 వేల 380 మందికి కొత్తగా స్పౌజ్ కేటగిరిలో పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆసరాగా నిలిచేందుకు అతడి భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పోజ్ పింఛన్ అమలు చేస్తోంది.
రేషన్ సరుకుల కోసం వైసీపీ ప్రభుత్వం వాహనాలు ప్రవేశపెట్టింది. గత ఐదేళ్లు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు అందించేవారు. అయితే ప్రజా ధనం వృథా అవుతుందని భావించిన కూటమి ప్రభుత్వం రేషన్ సరుకులు తీసుకెళ్లే వాహనాలను ఇతర ప్రభుత్వ పనులకు వినియోగించేలా చూస్తామన్నారు. అయితే వృద్ధులు, వికలాంగులకు మాత్రం ఇంటి వద్దకే రేషన్ సరుకులు డెలివరీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ వివరాలు..
– రూ.3వేల నుంచి రూ.4 వేలకు పెంపు – ఏప్రిల్ 2024 నుంచి అమలు
– దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు
– పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు పింఛన్
– కిడ్నీ తలసీమియా వంటి దీర్జకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్
































