నల్లేరు మొక్క గురించి మీకు తెలియని కొన్ని నిజాలు

నల్లేరు మొక్క ఎంత ఉపయోగమో చాలామందికి తెలుసు. ఎముకలు విరిగినా, జాయింట్లలో గుజ్జు తగ్గినా నల్లేరుని తినాలని డాక్టర్లు చెబుతుంటారు.


అయితే ఈ నల్లేరు మొక్క గురించి తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి. అవేంటంటే.. కుక్క, పిలిచినప్పుడు ఇది సూపర్‌గా పనిచేస్తుంది. దెబ్బలకు యాంటీ సెప్టిక్ అవుతుంది. ఇంకా దీని గురించి తెలుసుకుందాం..

నల్లేరు మొక్క ఒక ఔషధ మొక్క. ఇది ఎముకలు , కీళ్ల ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవాలన్నా, కీళ్ల నొప్పులను తగ్గించాలన్నా దీన్ని మించినది మరొకటి లేదు. అంతేకాదు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బరువును తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే నల్లేరుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మాత్రమే కాదు.. మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

యాంటీ సెప్టిక్

నల్లేరు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. అవును ఇది నిజం. పిల్లలు ఆటలాడుతున్నప్పుడు తరచూ పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలో వాళ్ల కాళ్లకు, చేతులకు దెబ్బలు తగులుంటాయి. ఇలాంటి సమయాల్లో నల్లేరుని బాగా మెత్తగా చేసి, దాని నుంచి వచ్చిన రసాన్ని ఆ దెబ్బలపై రాస్తే తొందరగా దెబ్బ మానిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దెబ్బలు తగిలినప్పుడు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది.

కుక్క, ఎలుక కరిస్తే..

చాలామంది ఇళ్లలో పెట్ డాగ్స్ ఉంటాయి. అవి ఒక్కొక్కసారి కరుస్తుంటాయి. అయితే ఇలా కరిచినప్పుడు కొంతమంది ఇంజెక్షన్లు చేయించుకుంటారు. మరికొంతమంది చిన్నదే కదా అని మామూలుగా ఉండిపోతారు. అయితే కుక్క కరిచినపుడు వెంటనే నల్లేరు రసాన్ని కరిచిన ప్రాంతంలో పూయాలి. దీనివల్ల దెబ్బ పెద్దది అవకుండా కాపాడుకోవచ్చు. అంతేకాదు ఎలుకలు కరిచినా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

దెబ్బ తగిలినప్పుడు

ఏ చిన్న దెబ్బ తగిలినా ఆ దెబ్బ తొందరగా మానాలంటే శరీరంపైన పూయడంతో పాటు నల్లేరుతో చేసిన పదార్ధాలను తినాలి. ఈ విధంగా శరీరంలోకి నల్లేరు వెళితే… దెబ్బలు వెంటనే మాయమైపోతాయి.

నల్లేరుని పచ్చడి, పొడి రూపంలో తినొచ్చు. అయితే దెబ్బ పెద్దదిగా తగిలినా, కుక్క, ఎలుకలు పెద్దగా కరిచినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. అంతేగానీ ఇంటివైద్యం చేయకూడదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.