TG: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను(10th Class Advance Supplementary Results) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం విడుదల చేసింది.


ఈ పరీక్షలో 73.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంతేగాకుండా.. బాలికలు పైచేయి సాధించారని అధికారులు వెల్లడించారు. ఫలితాలను www.bsc.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. కాగా, తెలంగాణలో గత విద్యా సంవత్సరం (2024-25) వరకు గ్రేడింగ్ సిస్టమ్ ఉండేది.

మార్కులు ప్రకటించకుండా గ్రేడింగ్ ఇచ్చే విధానం ఇన్ని రోజులు కొనసాగింది. ఈసారి గ్రేడింగ్ విధానం తీసేసి ఒకప్పటిలా మార్కుల విధానం ప్రవేశ పెట్టింది. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఇది అమల్లోకి వస్తోంది. నెక్ట్స్ ఇయర్ నుంచి మాత్రం 100 శాతం ఎక్స్‌టెర్నల్ విధానమే ఉండనుంది. ఈ అంశంపై అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభంలో మరింత స్పష్టత రానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.