రోడ్డుపై ఒక్కసారిగా ఆగిపోయిన సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు.. ఏమైందని చూడగా.

ధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ లోని 19 వాహనాలు ఒకేసారి బ్రేక్‌డౌన్‌ కావడం తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


శుక్రవారం ఉదయం ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండడంతో రాష్ట్ర సీఎం మోహన్‌ యాదవ్‌ గురువారం రాత్రి రోడ్డు మార్గానా రత్లాంక్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు డీజిల్‌ పోయించుకున్నాయి. ఆ తర్వాత యధావిథిగా ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు.. ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోవడం స్టార్ట్‌ చేశాయి.

ఇలా మొత్తం సీఎం కాన్వాయ్‌లోని 19 వాహనాలు ఒక్కసారిగా బ్రేక్‌ డౌన్‌ అయిపోయాయి.. దీంతో ఏం జరిగిందో అర్థం కాక ఆయోమయంలో పడిపోయారు కాన్వాయ్‌ను డ్రైవ్‌ చేస్తున్న సిబ్బంది. అయితే సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు అన్ని రోడ్డుపై ఆగిపోవడంతో రోడ్లు మొత్తం బ్లాక్‌ అయిన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో గమనించిన సిబ్బంది వాహనాలను చేతులతో తోస్తూ రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఇతర వాహనాన్ని తీసుకొచ్చి సీఎంను పంపించేశారు.

ఆ తర్వాత వాహనాలు ఎందుకు బ్రేక్‌డౌన్‌ అయ్యాయన్న దానిని పరిశీలించారు. అన్ని వాహనాలు ఒకే సారి ఆగిపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు డీజిల్‌ ట్యాంక్‌లను ఓపెన్‌ చేసి చేశారు.. ట్యాంక్‌లో ఉన్న డీజిల్‌లో నీళ్లు పొరలు కనిపించడంతో.. అందులో ఉన్న డీజిల్‌ను బయటకు తీసి చూశారు. ఆ డీజిల్‌లో సగానికి సంగం నీరు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే సదరు పెట్రోల్‌ పంప్‌ వద్దకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. అయితే తమ డీజల్‌లో ఎలాంటి కల్తీ లేదని పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు తెలిపారు. కానీ అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన బాటిల్‌లో డీజిల్‌ పోసుకోగా అందులో నీటి పొరలను గుర్తించినట్టు తెలిపారు. దీంతో అధికారులు పెట్రోల్‌ బంక్‌లో తనిఖీలు చేపట్టారు. కల్తీ నిర్ధారణ అయితే బంక్‌ను సీజ్‌ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నాయి. ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా పెట్రోల్‌ బంక్‌ను మూసి వేసినట్టు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.