ఎలక్ట్రిక్‌ విమానం వచ్చేసింది.. ఒక్కసారి చార్జి చేస్తే.. 463 కి.మీ

ఇటీవల దీనిని ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్.కెనడీ ఎయిర్‌పోర్ట్‌ల మధ్య ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. కాగా, ఈ 130 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ.. తమ విమానానికి అయిన ఖర్చు.. కేవలం రూ.694 లు మాత్రమేనని సదరు సంస్థ ప్రకటించింది. 100 శాతం విద్యుత్‌తో నడిచే తమ విమానం బాటలోనే రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ విమానాలు వస్తాయని, అప్పుడు కారుచౌకగా సామాన్యులు సైతం విమానం ఎక్కొచ్చని ఆ సంస్థ చెబుతోంది. కేవలం 35 నిమిషాల్లోనే.. తమ విమానం 130 కి.మీ ప్రయాణించిందని, తొలి ట్రిప్‌లో నలుగురు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిందని బీటా టెక్నాలజీస్ సీఈఓ క్లార్క్ చెప్పారు. కేవలం రూ. 694 రూపాయలతో తమ ప్రయాణం ముగిసిందని, అదే హెలికాఫ్టర్‌లో వెళ్లాలంటే.. కేవలం ఇంధనం కోసమే తాము దాదాపు 160 డాలర్లు( రూ. 13,800) ఖర్చు పెట్టాల్సి వస్తోందని వివరించారు. పైలట్ల జీతాలు, ఇతర ఖర్చులు ఉన్నప్పటికీ.. సాధారణ విమాన ప్రయాణాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ విమాన ప్రయాణం చాలా చౌక అని క్లార్క్ చెప్పుకొచ్చారు. 2017లో తాము ఈ సంస్థను పెట్టి, గత ఆరేళ్లుగా సీఎక్స్ 300 మోడల్ విమానాల మీద ప్రయోగాలు చేస్తున్నామని, ఎట్టకేలకు తాము సక్సెస్ అయ్యామని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. త్వరలోనే సివిల్ ఏవియేషన్ వారి అనుమతలు సాధించి ప్రయాణికుల కోసం విమానాలు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపారు. తమ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 463 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, దీనివల్ల చిన్న చిన్న టౌన్ల మధ్య సామాన్యులు సైతం తమ విమానంలో ప్రయాణించే అవకాశం ఎంతో దూరంలో లేదని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ప్రయోగం.. భవిష్యత్తులో విమానయాన రంగంలో గొప్ప విప్లవం సృష్టించనుందని నిపుణులు అంటున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.