హైడ్రోజన్‌ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌

హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే వాహనాలకు కొత్త కేటగిరీ రిజిస్ర్టేషన్‌ నంబర్‌ ప్లేట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈమేరకు శుక్రవారం ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం.. హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే వాణిజ్య వాహన నంబర్‌ ప్లేట్‌ పై సగభాగం ఆకుపచ్చ రంగులో, కింది సగభాగం నీలిరంగులో, ప్లేట్‌పై నంబర్లు పసుపు రంగులో ఉండనున్నాయి.


ప్రైవేటు వాహనాలు అయితే నంబరు ప్లేట్‌ పై సగభాగం ఆకుపచ్చ రంగులో, కింది సగభాగం నీలిరంగులో, నంబర్లు తెలుపు రంగులో ఉండనున్నాయి. అద్దెపై నడిచే క్యాబ్‌లకు అయితే నంబరు ప్లేట్‌ పై సగభాగం నలుపు రంగులో, కింది సగ భాగం నీలి రంగులో, నంబర్లు పసుపు రంగులో ఉండనున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.