MAHAA న్యూస్‌పై దాడి.. స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌(Hyderabad)లో మహా న్యూస్(Maha News) ఛానెల్ ప్రధాన కార్యాలయంపై బీఆర్‌ఎస్(BRS) దాడి చేయడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు.


మీడియా సంస్థపై ఇలా భౌతికంగా దాడి చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య అని అన్నారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయని తెలిపారు. డైరెక్ట్‌గా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో..

ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు(BRS Activists) మహా న్యూస్‌పై దాడులకు పాల్పడ్డారు. మహా ఛానెల్ ఆఫీసులోకి చొరబడి అద్దాలు పగలగొట్టారు, కార్లు ధ్వంసం చేశారు. రామన్న పైనే కామెంట్స్ చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.