అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు.. మొత్తానికి అసలువిషయం బయట పెట్టిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ . లతో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. 58 ఏళ్ల వయసులో కూడా సల్మాన్ ఖాన్ ఒంటరిగా జీవిస్తున్నాడు.


సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ జీవితంలోకి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. సల్మాన్ ఖాన్ లిస్ట్ లో.. సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. ఈ స్టార్స్‌తో సల్మాన్ డేటింగ్ చేశాడు.

59ఏళ్లు వచ్చినా కూడా సల్మాన్ ఖాన్ పెళ్లికి మాత్రం దూరంగా ఉంటున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోపోవడానికి కారణం తెలిపాడు. ఇటీవల కపిల్ శర్మ షో కు గెస్ట్ గా హాజరయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ కార్యక్రమాల్లో సల్మాన్ పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “ఈ వయసులో పెళ్లి చేసుకుని భార్యతో గొడవలు పడలేను. విడాకులొస్తే భార్యకి సగం ఆస్తి ఇవ్వాలి. నేనెంతో కష్టపడి సంపాదించుకున్నఆస్తి కోల్పోవడం నాకిష్టం లేదు. అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదు” అని సరదాగా అన్నారు సల్మాన్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సల్మాన్ ఖాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. అతని నికర విలువ రూ. 2900 కోట్ల రూపాయలు. సల్మాన్ ఖాన్ హీరోగానే కాదు.. చాలా బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా ఉన్నారు. బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్. అతను 2013 లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాడు. దీని ద్వారా సల్మాన్ చారిటబుల్ ట్రస్ట్‌కు సహాయం చేస్తున్నాడు. దీని ద్వారా ఎంతో మందికి సాయం అందించాడు సల్మాన్. కాగా సల్మాన్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. అతను ఫిట్‌నెస్ సెంటర్స్ కూడా ప్రారంభించాడు. ఇది భారతదేశం అంతటా 300 కంటే ఎక్కువ బ్రాంచ్ లు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. దీని కోసం వారు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. సల్మాన్‌ఖాన్‌కి ‘సల్మాన్‌ఖాన్‌ ఫిలిమ్స్‌’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఈ బ్యానర్ పై ‘బజరంగీ భాయిజాన్’, ‘రేస్ 3’, ‘ట్యూబ్‌లైట్’, ‘భారత్’ వంటి చిత్రాలను నిర్మించాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.