Puri Rath Yatra: పూరీ జగన్నాథ్ రథయాత్రలో 500 మంది భక్తులకు గాయాలు

డిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో అపశృతి చేసుకుంది. దాదాపు 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మూడు రథాలను లాగడానికి దాదాపు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.


పూరీలో రథాలను లాగుతున్న సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. అయోమయానికి గురైన భక్తులు మరికొందరు అటూ ఇటూ పరుగులు పెట్టడం ప్రారంభించారు. అక్కడ చిన్నపాటి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది.

కొంతమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని రెస్క్యూ బృందాలు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాయి. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అంత రద్దీలో మరి కొంతమందికి గాయాలు అయ్యాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.