బిగ్ బాస్ సీజన్ 9: ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోయే సెలబ్రిటీలు వీళ్లే

సీరియల్ నటి తేజస్వినీ గౌడ, ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్‌గా పాల్గొనబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే కొన్ని వారాల క్రితం బార్‌లో గొడవ పడి వార్తల్లో నిలిచిన నటి కల్పికా గణేశ్ కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి..


అలాగే అలేఖ్య చిట్టి పికెల్స్‌తో బాగా ఫేమస్ అయ్యింది అలేఖ్య మోక్ష రమ్య.. కొన్ని రోజులు క్రితం ఓ మూవీ ఈవెంట్‌లో కూడా ప్రత్యక్షమైంది. ఆమెకి బిగ్ బాస్ హౌస్ నుంచి పిలుపు వచ్చిందట. ఈసారి అలేఖ్య చిట్టి పికెల్స్ మోక్ష రమ్య కూడా బిగ్ బాస్‌ హౌస్‌లో ఉంటుందని అంటున్నారు..

అలాగే జబర్దస్త్ కమెడియన్ కోటాలో ఇమ్మాన్యుయెల్, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నాడు. అలాగే సీనియర్ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామికి కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. నవ్య స్వామికి తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకి గతంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసింది. మరి ఈసారి ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది..

అలాగే నిర్మాత ఎం. ఎస్. రాజు కొడుకు, హీరో సుమంత్ అశ్విన్ కూడా బిగ్ బాస్ సీజన్ 9 రియాల్టీ షోలో పాల్గొనబోతున్నట్టుగా సమాచారం.. అలాగే ‘ప్రేమించు’, ‘నువ్వే కావాలి’ వంటి సినిమాల్లో నటించిన నటుడు సాయి కిరణ్ కూడా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అలాగే బ్యాంకాక్ పిల్లగా ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ అయిన శ్రావణి వర్మ, సీరియల్ నటి దేబ్జానీ, సీరియల్ నటుడు ముకేశ్ గౌడ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్‌గా రాబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. వీరితో పాటు జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న రీతూ చౌదరితో పాటు ఢీ యాంకర్ దీపికా పిల్లి కూడా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి..

గత సీజన్‌లో కూడా తెలుగు బిగ్‌బాస్‌లో కన్నడ నటీనటులు ఎక్కువయ్యారనే ట్రోల్స్ వినిపించాయి. బిగ్ బాస్ తెలుగు అని కాకుండా బిగ్ బాస్ కన్నడ పార్ట్ 2 అని పెట్టాలని మీమ్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈసారి కూడా హౌస్‌లో కన్నడీగులు ఎక్కువగానే కనిపించబోతున్నారు. ఆగస్టులో లేదా 9వ సీజన్ కాబట్టి 9వ నెల సెప్టెంబర్‌లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కానుంది. గత సీజన్‌లో సెలబ్రిటీలు పెద్దగా లేకపోవడం వల్ల టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అందుకే ఈసారి సోషల్ మీడియా ఇన్ఫూయెన్సర్లకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చి, సెలబ్రిటీలను పెంచబోతున్నారట..

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.