కన్నప్ప 2వ రోజు కలెక్షన్స్.. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే..

హిందీలో రామాయణ్, మహాభారత వంటి అద్భుతమైన సీరియల్స్ తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు కన్నప్ప. ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.


ఇందులో ఆయన ప్రధాన పాత్రలో నటించగా.. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు మోహన్ బాబు. పాన్ ఇండియా మూవీగా ఈ ను AVA ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు, మధుబాల, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ఈ కు మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇందులో ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ బాబు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కన్నప్ప రూ.9.35 కోట్లు వసూలు చేసింది. విష్ణు మంచు కెరీర్‌లో ఇది అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ ఒక్కటే తొలి రోజు రూ.8.25 కోట్లు వసూలు చేసింది. ఇక మిగిలిన భాషలలో తమిళం (రూ. 0.15 కోట్లు), హిందీ (రూ. 0.65 కోట్లు), కన్నడ (రూ. 0.1 కోట్లు), మలయాళం (రూ. 0.2 కోట్లు) రాబట్టింది. ఇక ఇప్పుడు 2వ రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. జూన్ 28 శనివారం రూ.7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

మొత్తం అన్ని భాషలలో కలిపి రూ.16.35 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆదివారం కన్నప్ప కలెక్షన్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. తెలుగు వెర్షన్ మొత్తం 44.42 శాతం ఆక్యుపెన్సీతో బలమైన సంఖ్యలను కొనసాగించింది. నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సితారే జమీన్ పర్ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.