మా ఫ్యామిలీలో ఆయనే హిట్లర్‌.. నాతో పెళ్లికి ఆయన్ని ఒప్పించాలన్నా

దేవుడు కోరుకున్నదానికంటే అన్నీ ఎక్కువే ఇచ్చాడంటోంది ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) భార్య తేజస్విని (వైఘా రెడ్డి). మంచి కుటుంబం, పిల్లాడు ఉన్నాడని, ఇంతకంటే ఇంకేం కావాలని చెప్తోంది.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజస్విని (Tejaswini) మాట్లాడుతూ.. మా కుటుంబమంతా ఏడాదికి ఒకసారి మాత్రమే సినిమాకు వెళ్లేవాళ్లం. అది కూడా దసరా పండగప్పుడే థియేటర్‌కు వెళ్లి మూవీ చూసేవాళ్లం. అలాంటిది సినీ బ్యక్‌గ్రౌండ్‌ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. మా ప్రయాణం సులభంగా సాగలేదు.

గూగుల్‌లో వెతికా..
నిజానికి నాకు దిల్‌ రాజు ఎవరో తెలియదు. దర్శకుడేమో అనుకున్నాను. ఈయన ఎవరని గూగుల్‌లో వెతికితే నిర్మాత అని తెలిసింది. ఆయనకు ఆల్‌రెడీ పెళ్లయి కూతురుందని తెలిశాక నేను వెనకడుగు వేశాను. నేను చిన్నప్పుడు అమ్మమ్మ-తాతయ్య, అత్తమామల దగ్గరే ఎక్కువ పెరిగాను. పెళ్లికి ఎవరిని ఒప్పించాలి? అని దిల్‌ రాజు అడిగినప్పుడు మా పెద్దమామయ్య పేరు చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్‌లాగా ఉంటాడు.

పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదు
తను చాలా స్ట్రిక్ట్‌. ఆయన్ను ఒప్పించాక మా పిన్నిని కన్విన్స్‌ చేయాలన్నాను. ఆశ్చర్యంగా మా పెద్దమామయ్య మమ్మల్ని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ, పిన్ని అసలు నమ్మలేకపోయింది. మా పెళ్లికి తను ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది. మాతృత్వం గురించి మాట్లాడుతూ.. నా కొడుకు అన్వయ్‌ మూడేళ్లబాబులా ప్రవర్తించడు. ఎప్పుడైనా నేను బాధలో ఉంటే నాకు ముద్దుపెట్టి, అమ్మా బానే ఉన్నావా? అని అడుగుతాడు.

ఆ సినిమా తర్వాతే ప్రెగ్నెన్సీ
వాడి ముద్దు ముద్దు మాటలకు మాకు ఎంత ఒత్తిడి ఉన్నా ఇట్టే మాయం అయిపోతుంది. ఆ మధ్య బాలీవుడ్‌లో రాజ్‌కుమార్‌ రావు ‘హిట్‌’ మూవీ నిర్మాణ బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను. ఆ తర్వాత నేను గర్భం దాల్చడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాను. అన్వయ్‌ పుట్టాక నా జీవితమే మారిపోయింది. వాడు పుట్టి మూడేళ్లు కావడంతో సెకండ్‌ ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేస్తున్నావా? అని అడుగుతున్నారు. అన్వయ్‌తో నేను సంతోషంగా ఉన్నాను. ఇంకెవరూ నాకు వద్దు అని తేజస్విని పేర్కొంది.

దిల్‌ రాజు పర్సనల్‌ లైఫ్‌
దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. వీరికి కూతురు హన్షితా రెడ్డి సంతానం. 2017లో అనిత గుండెపోటుతో మరణించింది. అనంతరం హైదరాబాద్‌కు చెందిన తేజస్విని (వైఘా రెడ్డి)ని 2020లో దిల్‌ రాజు పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లిలోగల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.