మీ ఏడుపులే మాకు దీవెనలు..జగన్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ట్వీట్ చేసిన మాజీ సీఎం జగన్‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో స్పందించారు.


మీ ఏడుపులే మాకు దీవెనలు జగన గారూ.. మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం.

మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కోవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేసాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము..అని లోకేశ్ రాసుకొచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.