అధిక బరువు ఉండడం, లావుగా ఉండడం ఎలా ఆరోగ్యానికి హనికరమో… అదే విధంగా సన్నంగా, బరువు తక్కువగా ఉండడం కూడా అనారోగ్యం. అయితే బరువు పెరగాలంటే మాంసాహారం మాత్రమే మార్గం అని భావిస్తారు. అయితే శాఖాహారులైతే బరువు పెరగాలంటే ఎటువంటి ఆహారం తినాలని ఆలోచిస్తున్నారా.. ఈ రోజు శాఖాహార ఆహారాలలో కూడా ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగడానికి సహాయపడే అనేక ఆహారాలున్నాయి. అవి ఏమిటంటే..
అరటిపండు అరటిపండు రుచికరంగా ఉండటమే కాకుండా బరువు పెరిగేలా చేసే ఒక గొప్ప పండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. పాలతో స్మూతీ తయారు చేసుకోవచ్చు లేదా అల్పాహారంగా ఓట్స్‌తో తినవచ్చు. రోజుకు 2-3 అరటిపండ్లు తినడం వల్ల మీరు త్వరగా బరువు పెరుగుతారు. మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
బంగాళాదుంపలు బంగాళాదుంపలు కూడా బరువు పెంచేవిగా పరిగణిస్తారు. అందుకే సన్నగా బరువు తక్కువ ఉన్నవారు తినడానికి ఇవి సరైనవి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు గొప్ప మూలం. ఇవి శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. మీరు వీటిని ఉడికించి, బేక్ చేసి లేదా కూరలు తయారు చేసి తినవచ్చు. వేయించిన బంగాళాదుంపలు అనారోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. కనుక చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.
పప్పులు, రాజ్మా పప్పుధాన్యాలు (కందిపప్పు, పెసలు, మసూర్ వంటివి) , రాజ్మా వంటివి శాఖాహారులకు ప్రోటీన్ లకు అద్భుతమైన వనరులు. కండరాల పెరుగుదల, బరువు పెరగడానికి ప్రోటీన్ అవసరం. దీనితో పాటు వాటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ తినే ఆహారంలో ఒక గిన్నె శనగలు వంటి వాటిని లేదా రాజ్మా వంటి వాటిని చేర్చుకోండి.
వేరుశెనగ వెన్న వేరుశెనగ వెన్న ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీల గొప్ప కలయిక. బరువు పెరగడానికి, శక్తి స్థాయిలను నిర్వహించడానికి ఇది రుచికరమైన, పోషకమైన ఎంపిక. మీరు దీన్ని బ్రెడ్ మీద, పండ్ల మీద అప్లై చేయడం లేదా మీ స్మూతీలో కలపడం ద్వారా తినవచ్చు. అయితే దీనిని తినాలంటే.. చక్కెరని ఉపయోగించకుండా సహజ వేరుశెనగ వెన్నను ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.
డ్రై ఫ్రూట్స్ బాదం, వాల్నట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌లో కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి. బరువు పెరగడానికి కూడా సహాయపడతాయి. మీరు వీటిని స్నాక్‌గా తినవచ్చు. అల్పాహారంగా చేర్చుకోవచ్చు. లేదా పాలతో కలిపి పేస్ట్ తయారు చేసుకుని తినవచ్చు. ప్రతిరోజూ ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వలన మిమ్మల్ని ఫిట్‌గా , శక్తివంతంగా ఉంచుతాయి.
































