6000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉన్న టాప్​ బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి- ధర రూ. 17వేల కన్నా తక్కువే

భారత మార్కెట్​లో ఇప్పుడు బడా బ్యాటరీ స్మార్ట్​ఫోన్స్​కి డిమాండ్​ విపరీతంగా కనిపిస్తోంది. పైగా బడ్జెట్​ రేంజ్​లోనే పెద్ద బ్యాటరీ స్మార్ట్​ఫోన్స్​ లభిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రూ.17వేల కన్నా తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని 6000ఎంఏహెచ్​+ బ్యాటరీ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..


రియల్​మీ నార్జో 80ఎక్స్​- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్​ ఉంటుంది. 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ దీని సొంతం. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్​ఫోన్​ ధర అమెజాన్​లో రూ. 12,998గా ఉంది.

శాంసంగ్​ గెలాక్సీ ఎం35- ఈ స్మార్ట్​ఫోన్​లో 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఎక్సినోస్​ 1380 ప్రాసెసర్​ దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది. అమెజాన్​లో ఈ గెలాక్సీ ఎం35 ధర రూ. 16,998 నుంచి ఉంది.

రియల్​మీ పీ3ఎక్స్​- ఈ 5జీ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్​ ఉంటుంది. 50ఎంపీ+2ఎంపీ రేర్​, 8ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. అమెజాన్​లో ఈ రియల్​మీ పీ3ఎక్స్​ ధర రూ. 12,700 వరకు ఉంది.

మోటో జీ64- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 15,499 నుంచి ఉంది. ఇందులో 6000ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు మీడియాటెక్​ డైమెన్సిటీ 7025 చిప్​సెట్​ ఉంటుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం.

శాంసంగ్​ గెలాక్సీ ఎం15- ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ 6100+ ప్రాసెసర్​ ఉంటుంది. 50ంఎంపీ+5ఎంపీ+2ఎంపీ రేర్​, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. 6000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​ ప్రారంభ ధర అమెజాన్​లో రూ. 10,500గా ఉంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.