ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న టాప్ 3 స్టార్ డైరెక్టర్స్ ఎవరో తెలుసా.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం అంటే అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక కథని రాసుకొని దానిని అద్భుతంగా చిత్రీకరించే కెపాసిటి ఉన్న దర్శకులు మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటారు… ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంది. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా టాప్ డైరెక్టర్లు మాత్రం గొప్ప సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ ఉండడం విశేషం…


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండియాలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేటు గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకునే సినిమాలు చేసిన దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఇక ఇప్పటి వరకు ఆయన ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. దాదాపు ఆయన ఒక సినిమా కోసం 250 నుంచి 300 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి ఆయన రెమ్యూనికేషన్ తీసుకోవడం లేదు. లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు కాబట్టి ఆ వాటా అయినా కూడా అతనికి 300 కోట్ల వరకు ముడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన తర్వాత ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఉన్నాడు…

తను కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నప్పటికీ ఒక సినిమా కి దాదాపు 100 కోట్ల వరకు ఆయనకి వాటా ముడుతుంది. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు పోటీ పడుతూ ఉండడం విశేషం… ఇక సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ ఇద్దరు థర్డ్ పోజిషన్లో ఉన్నారు.

వీళ్ళు దాదాపు 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఈ నలుగురు దర్శకులు టాప్ 3 లో నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఒక వేళ వీళ్ళు భారీ సక్సెస్ లను సాధిస్తే వీళ్ళ రెమ్యునరేషన్స్ ఇంకా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరికి దక్కని క్రేజ్ ఈ స్టార్ డైరెక్టర్లకు దక్కుతుండటం విశేషం…

ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు పాన్ ఇండియా సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వీళ్ళు మాత్రం పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లోకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తే మాత్రం వీళ్ళ రెమ్యునరేషన్స్ మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.