చిగుళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత ఎంతో అవసరం. పళ్లు, నాలుగు ఆరోగ్యంగా ఉంటేనే నోటి దుర్వాసన లేకుడా ఉంటుంది. అలాగే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
అయితే కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినప్పటికీ పళ్లకు గారిపట్టి పశుపు పచ్చగా మారిపోతాయి. దీనివల్ల నలుగురిలో వెళ్లాలన్నా.. మనస్పూర్తిగా నవ్వాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే మీ పళ్లు మిలమిల మెరిసిపోతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు బ్రష్ చేసినా.. కొన్ని సార్లు పళ్లపైన గార ఏర్పడుతుంది. దీన్నే కాలిక్యులస్ అని అంటారు. ఇది పసుపు.. గోదుమ రంగులో ఉంటుంది. ఇది ప్లేక్ లాగా పేరుకుపోయి గట్టిపడినపుడు దంతాల మీద గార ఏర్పడుతుంది. అయితే కొన్ని చిట్కాలు ఇంట్లోనే పాటిస్తే పళ్లపై ఉండే గార పోతుంది.
కొబ్బరి నూనె
నోటిలో కొబ్బరి నూనె వేసుకుని పుక్కులిస్తే నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది నోటిలోపల ఉండే బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. ఒక పదినిమిషాలు పాటు ఇలా చేస్తే మంచిది. తర్వాత నూనె ఉమ్మేసి.. మీనోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.
ఉప్పు, పేస్ట్ మిశ్రమం
బ్రష్ చేసేటప్పుడు ఉప్పులో కాస్త పేస్ట్ కలిపి పళ్లకు అప్లై చేయాలి. ఒక రెండు నమిషాలు ఉంచిన తర్వాత బ్రష్‌తో క్లీన్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల పళ్లపైనున్న గారె పోతుంది. అదేవిధంగా ఒక గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూను ఉప్పువేసి కలిపిన తర్వాత వాటిని నోటీలో వేసుకుని పుక్కులించాలి. ఈ ప్రాసెస్‌ని కూడా వారానికి రెండు మూడు సార్లు చేస్తే గారె తగ్గుతుంది.
బేకింగ్ సోడా పేస్ట్
ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే పదార్ధం.. బేకింగ్ సోడా. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు పళ్లను శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది నోటిలో హానికరమైన బ్యాక్టీరియతో ఫైట్ చేసి చంపుతుంది. ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో ఒక అర స్పూన్ నీళ్లు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. దీని బ్రష్‌పై పెట్టుకుని తోమాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేయడం వల్ల పళ్లపై గారె పోతుంది. పైగా పళ్లు ప్రెష్‌గా కనిపిస్తాయి.
ఇంటిలో ఎన్ని చిట్కాలు పాటించినా గారె పోవడం లేదంటే అది మరీ ఎక్కువగా పళ్లపై పేరుకుపోయిందని అర్ధం. కాబట్టి వెంటనే డాక్టర్‌ని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి.
































