వేలిముద్రలకు సెలవిక

ప్రభుత్వం పేదలతోపాటు పలు చేతివృత్తిదారుల కు పింఛన్లను పంపిణీ చేస్తోంది.


అయితే వయ స్సు మీద పడటంతో వృద్ధుల వేళ్లు మడతలు పడతాయి. దీంతో వేళ్లపై ఉండే గీతలను ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్లు గుర్తించడంలేదు. ఫలితంగా కొన్నేళ్లుగా చాలామంది వయో వృద్ధులు సకాలంలో పింఛన్లు పొందలేక తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. వేలి ముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో ఫించన్‌ చెల్లింపులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్లు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణ లు వచ్చాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై కొత్త నిర్ణయాన్ని తీసుకుంటోంది.

పింఛన్‌దారులకు మేలు చేకూరేలా చర్యలు చేపడుతోంది. జిల్లాలో మొత్తం 17 మండలాలు, 428 గ్రా మపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీల్లో మొత్తం 99,402 పింఛన్‌దారులు ఉన్నారు. అన్నిచోట్ల కూడా పింఛన్‌దారులకు స్కానర్ల సమస్య నెలకొంది. గ్రామ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో ఫేస్‌ రికగ్నేషన్‌ (ముఖ గుర్తింపు) ఆధారిత పింఛన్‌ పంపిణీకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌కు రూపకల్పన చేసింది. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు తగిన శిక్షణను అందించి, పింఛన్లను వేలిముద్రతో పనిలేకుండా ముఖాన్ని యాప్‌ గుర్తిస్తుంది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పింఛన్లు పొందవచ్చు. మృతి చెందినవారు, వలస వెళ్లిన వారి పూర్తి వివరాలు కూడా తెలిపిపోతుంది. వారి పింఛన్లు కూడా పక్కదారి పట్టే అవకాశం లేదని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల నుంచే ముఖ ఆధారిత పింఛన్‌ పంపిణీ అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

యాప్‌ అందుబాటులోకి వచ్చేలోపు శిక్షణ

ప్రభుత్వం ఫేస్‌ రికగ్నేషన్‌ ఆధారిత పింఛన్లు పంపిణీపై కసరత్తు చేస్తుండటంతో, యాప్‌ పనితీరు పై మొదటగా ఉన్నతాఽధికారులకు శిక్షణను పూర్తిచేసింది. జిల్లాస్థాయిలో డీఆర్‌డీఏ, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తపాలా శాఖ అధికారులు, బిల్‌ కలెక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి వచ్చేలోగా పింఛన్‌దారుల సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో మృతిచెందిన పిం ఛన్‌దారుల స్థానంలో వారి భార్యలకు అవకాశం కల్పిచేందుకు చర్యలు తీసుకోనున్నారు. వలస వెళ్లి మూడునెలలుగా పింఛన్‌ తీసుకోని లబ్ధిదారులు, మృతి చెందిన లబ్ధిదారుల పేర్లు తొలగించడం, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన వాటిని పరిష్కరించడం, రెగ్యులర్‌ పింఛన్‌దారుల వివరాలు గుర్తించాలని సూచిస్తున్నారు. కొత్తగా అర్హులైన పింఛన్‌దారుల వివరాలు నమోదు చేసుకున్నట్లయి తే ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే చెలించేందు కు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ ఫేస్‌ రికగ్నేషన్‌ ఆధారిత పింఛన్ల పంపిణీతో సిబ్బందికి పని సులువుకానుంది. గురువారం సూర్యపేట జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. వారం రోజుల్లోగా జిల్లాలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం పింఛన్‌దారులకు ఫేస్‌ రికగ్నేషన్‌ ఆధారితంగా ఇచ్చేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తుందని, ప్రస్తుతం శిక్షణలు ఇస్తున్నట్లు డీఆర్డీవో కె.నాగిరెడ్డి వెల్లడించారు.

వేలిముద్రలను గుర్తించని స్కానర్లు

పింఛన్ల పంపిణీలో చాలా మందికి సమస్యలు ఎదరువుతున్నాయి. జిల్లాలో చేయూత పథకం కింద వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మొత్తం 99,402మంది లబ్ధిదారులు పింఛ న్లు పొందుతున్నారు. వృద్ధుల వేలిముద్రలు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లు గుర్తించడంలేదు. దీంతో గ్రామాలు, పట్టణాల్లో వృద్ధులు పింఛన్లు పొందేందుకు నాలుగైదు సార్లు స్కాన్‌ చేయాల్సి వస్తుంది. ఒకరోజు వేలిముద్రలు స్కాన్‌ కానిపక్షంలో మరోరోజు కూడా గ్రామపంచాయతీ, మునిసిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ కేంద్రానికి రావాల్సి వస్తుంది. దీనికి తోడు పింఛన్‌పంపిణీ చేసేవారికి కూడా ఒక్కో లబ్ధిదారుని నాలుగైసార్లు స్కాన్‌ చేయడం తో సమయం కూడా చాలా పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముఖ ఆధారిత పింఛన్‌తో లబ్ధిదారులతోపాటు పింఛన్లు పంపిణీ చేసే సిబ్బందికి కూడా తిప్పలు తప్పనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.