ఎన్నో నష్టాల తర్వాత BSNL రికవర్ అవుతోంది. ప్రభుత్వం యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల లాభాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
BSNL తమ పాత వినియోగదారులను మళ్లీ ఆకర్షించడానికి, ఇతర టెలికాం యూజర్లను ఆకర్షించడానికి సన్నద్ధమైంది. ఈ క్రమంలో BSNL కంపెనీ చాలా తక్కువ ధరలకే, వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్స్ ప్రైవేట్ టెలికాం సంస్థలు Airtel, Jioలకు సవాలు విసురుతున్నాయి.
BSNL తీసుకొచ్చిన 147 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ముఖ్యంగా ఇంటర్నెట్ కంటే కాల్స్ ఎక్కువగా చేసే వినియోగదారులకు బెనిఫిట్ అవుతుంది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. అదనంగా వీరికి 10GB ఇంటర్నెట్ డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా మీకు నచ్చిన విధంగా ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. డైలీ లిమిట్ లేదు, మీరు కోరుకుంటే మొత్తం డేటాను ఒక రోజులో వాడేయవచ్చు. లేకపోతే వ్యాలిడిటీ ఉన్న నెల రోజుల పాటు ఉపయోగించవచ్చు.
మీకు కాల్స్ మాత్రమే కాదు, ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించేవారు అవసరమైతే BSNL ₹247 ప్లాన్ బెస్ట్ ఛాయిస్. ఈ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ డేటా ప్యాక్ ద్వారా వినియోగదారులకు 50GB డేటా, ప్రతిరోజూ 100 SMSలు లభిస్తాయి. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లోనూ డేటా వినియోగానికి ఎలాంటి రోజువారీ లిమిట్ లేదు. వ్యాలిడిటీ గడువులోపు మీకు కావాల్సిన సమయంలో, ఆ డేటాను ఒకేసారి సైతం ఉపయోగించవచ్చు.
BSNL ఈ ప్లాన్లు.. ప్రైవేట్ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియోల ధరలతో పోల్చితే తక్కువే అని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ కంపెనీలు డేటా, వాయిస్ కాల్స్ కోసం వినియోగదారుల నుండి ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నాయి. కానీ BSNL తక్కువ ధరలకు కస్టమర్లకు మంచి ప్లాన్ ప్యాకేజీని అందిస్తోంది. BSNL తన నెట్‌వర్క్ నాణ్యతను కొంచెం మెరుగుపరుచుకుంటే Airtel, Jio వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
BSNL యొక్క ఈ ప్రయత్నం వినియోగదారులను మళ్ళీ ఆకర్షించడంలో మంచి అడుగు అయితే, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీని కూడా ప్రోత్సహిస్తుంది. BSNL యొక్క ఈ కొత్త ప్లాన్లు మార్కెట్‌లో ఎంత ప్రభావం చూపుతాయో మరియు ఇది కంపెనీ లాభాలను మరింత వేగవంతం చేస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.
































