ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవితంలో స్థిరపడటం అంటే ఆషామాషీ కాదు. చాలా కష్టపడాలి. కష్టపడాలి అని చెప్పేదాని కంటే మంచి ఆలోచనతో కోర్సులు ఎంచుకుంటే వారి జీవితం బంగారుమయం అవుతుంది.
ఆధునిక యుగానికి తగినట్లుగా విద్యార్థులు తమ కోర్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కోర్సుల్లో బీఎస్సీ డేటా సైన్స్ అనేది అత్యంత కీలకం. బీఎస్సీ డేటా సైన్స్ కోర్సు చదివిన వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఈ కోర్సు వ్యవధి ఎంతకాలం.. కోర్సు పూర్తి చేసిన వారికి కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయో ఓసారి తెలుసుకుందాం.
బీఎస్సీ డేటా సైన్స్‌కు విపరీతమైన డిమాండ్
ఆధునిక యుగంలో డేటా అనేది అత్యంత కీలకంగా మారింది. డేటా ఆధారిత ప్రపంచంలో నైపుణ్యం కలిగిన డేటా ఇంజనీర్ల అవసరం విపరీతంగా ఉంది. అందుకే బీఎస్సీ డేటా సైన్స్ చదివిన వారికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో ఆయా కంపెనీలు ఈ రంగంలో నిపుణులను భారీ ప్యాకేజీ ఇచ్చి మరి నియమించుకుంటున్నాయి. బీఎస్సీ డేటా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ అనేది మూడు సంవత్సరాల కాల వ్యవధి. ఇది ఇంటర్ డిసిప్లినరీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఈ కోర్సులో కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ మరియు మ్యాథమెటిక్స్‌ను ఉంటాయి. ఈ యూజీ ప్రోగ్రామ్ మెషిన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు పైథాన్ ప్రోగ్రామింగ్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ కోర్సు విద్యార్థులకు డేటాతో పని చేయడానికి మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు శిక్షణ ఇస్తుంది.
































