హిందూ మతంలో వాస్తుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందులో భాగంగా ఇంటి వంటగదికి కూడా వాస్తు తప్పనిసరి. వంటిల్లు అంటే వంట చేయడానికి మాత్రమే కాదు, అన్నపూర్ణ నిలయం.
లక్ష్మి నివాసం కూడా. కాబట్టి, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలంటే వంటగదికి సంబంధించిన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాటిని విస్మరించడం వల్ల లక్ష్మిదేవికి కోపం వస్తుంది. దాంతో ఆ ఇంటిల్లిపాది ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు అంటున్నారు వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు. అలాంటి కొన్ని వంటింటి నియమాలను ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా ప్రజలు వంటగదిలో పాత్రలను కడిగిన తర్వాత తలక్రిందులుగా ఉంచుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, వంటింట్లోని రెండు పాత్రలు మాత్రం మర్చిపోయి కూడా ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదని అంటున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, ఇది ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో వంట చేసిన తర్వాత పాత్రలను కడగడం, వాటిని సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యం. నియమాలను పాటించడం వల్ల కుటుంబ సభ్యుల పురోగతి, సంపదలో శ్రేయస్సు లభిస్తుంది. వంటింట్లోని కడాయ్, తవాను ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
తవా తలక్రిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, తరచుగా ఇంట్లో గొడవలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనితో పాటు, ఇంట్లో పేదరికం తీష్టవేస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. తవాను బోర్లగా ఉంచడం వల్ల లక్ష్మీ దేవి కోపానికి కారణమవుతారని అంటున్నారు. దాంతో ఇంట్లోని ఆనందం కరిగిపోతుంది. డబ్బు కొరతను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తవాను బోర్లాగా పెట్టకూడదని సూచిస్తున్నారు. తవాను ఎప్పుడు కడిగినా నిటారుగా ఉంచండి. దీనితో పాటు, మురికి పాత్రలను రాత్రిపూట వంటగదిలో ఉంచకూడదని కూడా గుర్తుంచుకోండి.
































