సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం మాత్రమే కాకుండా వ్యక్తిత్వ పరీక్షా పద్ధతుల ద్వారా కూడా మన లక్షణాలను, స్వభావాన్ని తెలుసుకోవచ్చు. వ్యక్తిత్వ పరీక్షలకు సంబంధించిన అనేక విషయాలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా నేటి వ్యక్తిత్వ పరీక్షలో ముక్కు ఆకారం ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని, మీలో దాగిన లక్షణాలను తెలుసుకోండి.
వ్యక్తిత్వ పరీక్ష పద్ధతుల ద్వారా మనలో ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగ వైఖరి, మనం అంతర్ముఖులమా లేదా బహిర్ముఖులమా మొదలైనవాటిని తెలుసుకోవచ్చు. అంతేకాదు మనలో దాగిన లక్షణాలు, స్వభావాలను తెలుసుకోవచ్చు. కళ్ళు, ముక్కు, పాదాలు, కాలి వేళ్లతో సహా శరీర ఆకృతి ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పరీక్షించడం కూడా వ్యక్తిత్వ పరీక్షలో ఒక భాగం. ఈరోజు ముక్కు ఆకారం ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరి ముక్కు ఆకారం భిన్నంగా ఉంటుంది. ముక్కు ఆకారం ఆధారంగా మీరు నిజాయితీపరులా లేదా భావోద్వేగ వ్యక్తిలా అనేది తెలుసుకోండి.
ముక్కు ఆకారం మీ వ్యక్తిత్వం గురించి తెలియజేస్తుంది
రోమన్ ముక్కు: ఈ రకమైన ముక్కు ఉన్న వ్యక్తులు బహిరంగతకు విలువ ఇస్తారు. ఈ రకమైన ముక్కు ఉంటే.. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. సవాళ్లను బాగా స్వీకరించే నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాదు నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడరు. నిజాయితీ, సున్నితత్వం కలయిక కలిగిన వ్యక్తి.
నుబియన్ ముక్కు: (విశాలమైన ముక్కు) ఈ రకమైన ముక్కు ఉన్నవారు ప్రేరణతో వ్యవహరిస్తారు. ఎక్కువగా ఆలోచించకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆశావాదంగా, ఉత్సుకతతో ఉంటారు. మాట్లాడడం చాలా ఈజీ. చాలా విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఉత్సుకతతో ఉంటారు. సమస్యలను పరిష్కరించడానికి లేదా ఫలితాలను చేరుకోవడానికి ఎల్లప్పుడూ కొత్త, సృజనాత్మక మార్గాల కోసం చూస్తారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఎవరిపైనా కోపం చూపించరు. గొంతు ఎత్తి అరవరు.
గ్రీకు ముక్కు: గ్రీకు లేదా ముక్కు సూటిగా ఉన్న వ్యక్తులు అన్నింటికంటే నిజాయితీని విలువైనదిగా భావిస్తారు. ఏ రకమైన మోసాన్ని ఇష్టపడరు. కపటత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అధిక స్థాయి ఆకర్షణ, స్పష్టమైన ఆలోచన, సహనం, ఓర్పు, దయ, సరళత, నిజాయితీ, క్రమశిక్షణ, విశ్వసనీయతను కూడా కలిగి ఉంటారు.
పైకి తిరిగిన ముక్కు: పైకి తిరిగిన ముక్కు ఉన్న వ్యక్తులు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. దృఢనిశ్చయం, వ్యవస్థీకృత, నిజాయితీపరులైన ఈ వ్యక్తులు ఇతరులకు స్ఫూర్తినిచ్చే సహజ నాయకులు. ఎవరికైనా ఈ రకమైన ముక్కు ఉంటే పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకుంటారు. లక్ష్యాలను సాధించడానికి సత్య మార్గాన్ని అనుసరిస్తారు.
హుక్డ్ ముక్కు: పక్షి ముక్కులా కనిపించే ముక్కు ఉంటే నమ్మదగినవారు. నిజాయితీపరులు అని అర్థం. ప్రజలు వీరి నిజాయతీని, వీరి స్వభావాన్ని అభినందిస్తారు. ముక్కుసూటి స్వభావం ఇతరులను మరింత బహిరంగంగా , నిజాయితీగా ఉండటానికి ప్రేరేపిస్తుంది.
చదునైన ముక్కు: చదునైన ముక్కు ఉన్నవారు భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ ఉత్సాహం జీవితంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇది నిజాయితీగా జీవించడానికి ఇష్టపడతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
































