రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ హామీతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు మార్క్ ఫెడ్‌కు అనుమతి లభించింది.


మూడు రోజుల్లో రుణం అందే అవకాశం ఉంది. మార్క్‌ఫెడ్‌కు రుణం అందగానే ధాన్యం సేకరించిన పౌర సరఫరాల సంస్థకు నగదు బదిలీ చేస్తాం. తద్వారా ఆ సంస్థ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపులు వెంటనే చేస్తుంది..అని మార్క్ ఫెడ్ ఎండీ పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.