భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా ఈవీ స్కూటర్ నిర్వహణ కూడా తక్కువ కావడంతో వీటిని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ కొత్త ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ గ్రీవ్స్ ఆంపియర్ ఈవీ స్కూటర్‌కు అప్డేట్ వెర్షన్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ ఆంపియర్ దాని ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ – ఆంపియర్ నెక్సస్ కోసం ఒక పెద్ద అప్డేట్ను ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి హై-పెర్ఫార్మెన్స్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన నెక్సస్ ఇండియా డిజైన్ మార్క్, బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను గెలుచుకుంది. అయితే అప్డేట్ విషయానికి వస్తే ఇకపై నెక్సస్ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీతో పనిచేస్తుంది, ఇది భద్రత, విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి రైడర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100–110 కి.మీ. వాస్తవ పరిధిని, 93 కి.మీ. గరిష్ట వేగంతో ఈ ఈవీ స్కూటర్‌పై దూసుకుపోవచ్చు. ఈ స్కూటర్ అత్యుత్తమ సస్పెన్షన్, ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడా వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే కేవలం 3 గంటల 22 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవతుంది.
ఆంపియర్ అన్ని నెక్సస్ వేరియంట్లలో పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న 5 సంవత్సరాల లేదా 75,000 కి.మీ బ్యాటరీ వారంటీని అందిస్తోంది. ఫైనాన్సింగ్ ఎంపికల విషయానికి వస్తే నెక్సస్‌ను ఎక్కువ మంది కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఆంపియర్ ఒక సరసమైన ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రారంభించింది. వినియోగదారులు అతి తక్కువ డౌన్ పేమెంట్లు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల అటే కేవలం 6.99 శాతం నుంచి ఈఎంఐ ద్వారా ఈ ఈవీ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఆంపియర్ నెక్సస్ ప్రారంభ ధర రూ.1,14,900గా ఉంది. భద్రత, పనితీరు, అందుబాటు ధరల సమ్మేళనంతో, పూర్తి ఎలక్ట్రిక్ వాహనాల అనుభవాన్ని కోరుకునే భారతీయ కుటుంబాలకు నెక్సస్ అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.
































