వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. తాజాగా మరో రెండు ఫీచర్లతో కస్టమర్ల ముందుకువచ్చింది. వీటిద్వారా చాటింగ్ కాస్త సరదాగా మారనుంది.
వాట్సాప్ తన వినియోగదారుల చాటింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ ఫీచర్లు జిఐఫ్ కీబోర్డుల కోసం ఒకటి. మరోకొటి చాట్ థీమ్ సెట్టింగ్. కొత్త ఫీచర్ మునుపటి కంటే జిఐఫ్ కీబోర్డులో ఎక్కువ అంశాలను చూపిస్తుంది. దీనితో వినియోగదారులు చాటింగ్ చేసేటప్పుడు సరైన జిఫ్ కోసం సులభంగా సెర్చ్ చేయవచ్చు.
జిఐఫ్ కీబోర్డు
డబ్ల్యూఏబీటాఇన్ఫో కొత్త జిఐఫ్ కీబోర్డు స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. కంపెనీ ఇప్పుడు జిఐఫ్ కీబోర్డులో రెండు కాలమ్స్‌కు బదులుగా మూడు కాలమ్‌లను వినియోగదారులకు అందిస్తోంది. గతంలో జిఐఫ్ కీబోర్డులో రెండు కాలమ్స్ ఉండటం వల్ల యూజర్లు పర్ఫెక్ట్ జిఐఫ్ కోసం చాలా స్క్రోల్ చేయాల్సి వచ్చేది. కొత్త ఫీచర్ యూజర్ సమస్యను తొలగిస్తుంది. జిఐఫ్ కీబోర్డులో అదనపు కాలమ్స్ పొందడం ద్వారా.. వినియోగదారులు మునుపటి కంటే 50 శాతం ఎక్కువ జిఫ్‌లను చూస్తారు. దీని ద్వారా యూజర్లు ట్రెండింగ్, పాపులర్ జీఐఎఫ్లను వేగంగా సెర్చ్ చేయడం సులువవుతుంది.
చాట్ థీమ్స్
ఐఓఎస్ కోసం ఏఐ ఆధారిత చాట్ వాల్ పేపర్లను జనరేట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఐఓఎస్ 25.19.75 కోసం వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ స్క్రీన్ షాట్‌ను కూడా డబ్ల్యూఏబీటాఇన్ఫో షేర్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో మెటా ఏఐని ఉపయోగించి చాట్ వాల్ పేపర్లను జనరేట్ చేసుకోవచ్చు.
చాట్ థీమ్ సెట్టింగ్స్‌లో యూజర్లకు చాట్ కస్టమైజేషన్ విభాగాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో ఇచ్చిన మెటా ఏఐ నుంచి వాల్ పేపర్ క్రియేట్ చేసే ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు ప్రాంప్ట్ ఫీల్డ్‌ను ఓపెన్ చేయవచ్చు. ఈ ప్రాంప్ట్ ఫీల్డ్‌లో, వినియోగదారులు తమకు ఎలాంటి చాట్ వాల్ పేపర్ కావాలో మెటా ఏఐకి వివరించవచ్చు.































