మిడ్ రేంజ్​లో అతిపెద్ద బ్యాటరీ స్మార్ట్​ఫోన్స్​ ఇవి- అదిరిపోయే ఫీచర్స్

పోకో ఎఫ్7 వర్సెస్ ఐక్యూ నియో 10.. ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​ని పోల్చి ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాము..

భారతదేశంలో మిడ్‌రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ తీవ్ర పోటీతో దూసుకుపోతోంది. బ్రాండ్‌లు పనితీరు, డిస్‌ప్లే నాణ్యత, బ్యాటరీ లైఫ్​లో సరిహద్దులను దాటుతున్నాయి. ఇటీవల, పోకో- ఐక్యూ రూ. 35,000 లోపు ధరల విభాగంలో లేటెస్ట్​ గ్యాడ్జెట్స్​ని తీసుకొచ్చాయి. అవి.. పోకో ఎఫ్7 5జీ , ఐక్యూ నియో 10. ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..


పోకో ఎఫ్7 వర్సెస్ ఐక్యూ నియో 10: డిస్‌ప్లే

పోకో ఎఫ్7 పెద్ద 6.83-ఇంచ్​ అమోఎల్​ఈడీ స్క్రీన్‌ను 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 3200 నిట్‌ వరకు పీక్​ బ్రైట్​నెస్​ చేరుకోగలదు. ఇది ప్రకాశవంతమైన పరిస్థితులలో వినియోగదారులకు స్పష్టమైన దృశ్యమానతను అందిస్తుంది.

మరోవైపు, ఐక్యూ నియో 10 కొద్దిగా చిన్నదైన 6.78-ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఇది వేగవంతమైన 144హెచ్రి​జెడ్​ రిఫ్రెష్​ రేట్‌ను, చాలా ప్రకాశవంతమైన డిస్‌ప్లేను (5000 నిట్‌ల వరకు) అందిస్తుంది.

పోకో ఎఫ్7 వర్సెస్ ఐక్యూ నియో 10: ప్రాసెసర్, మెమరీ..

పోకో ఎఫ్7, ఐక్యూ నియో 10 స్మార్ట్​ఫోన్​లు రెండూ ఒకే ప్రాసెసర్‌ను ఉపయోగిస్తాయి. అదే స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4. పోకో ఎఫ్7 12జడీబీ వరకు ర్యామ్​తో అందుబాటులో ఉంది. 24GB వరకు టర్బో ర్యామ్​తో మెమరీని విస్తరించగలదు. అదనంగా, ఇది 512జీబీ యూఎఫ్​ఎస్​ 4.1 స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. మరోవైపు, ఐక్యూ నియో 10 16జీబీ వరకు ర్యామ్​, 512జీబీ వరకు యూఎఫ్​ఎస్​ 4.1 స్టోరేజ్‌తో వస్తుంది.

రెండు డివైజ్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కస్టమ్ యూఐలో పనిచేస్తాయి. పోకో ఎక్కువ సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందిస్తుంది. నాలుగు సంవత్సరాల అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. కాగా ఐక్యూ మూడు సంవత్సరాల ఓఎస్​ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను హామీ ఇస్తుంది.

పోకో ఎఫ్7 వర్సెస్ ఐక్యూ నియో 10: కెమెరాలు..

పోకో ఎఫ్7 స్మార్ట్​ఫోన్​ వెనుక వైపు డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపున 20ఎంపీ కెమెరా కూడా ఉంది.

ఐక్యూ నియో 10 50ఎంపీ ప్రధాన సెన్సార్, విస్తృత షాట్‌లు, మరింత బహుముఖ ప్రజ్ఞ కోసం 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. షార్పర్ సెల్ఫీలు కోసం ముందు వైపున 32ఎంపీ కెమెరా ఉంది.

పోకో ఎఫ్7 వర్సెస్ ఐక్యూ నియో 10: బ్యాటరీ..

పోకో ఎఫ్7 పెద్ద 7550ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, ఐక్యూ నియో 10 స్మార్ట్​ఫోన్​ 7000ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంది. 120డబ్ల్యూ ఛార్జర్‌తో వస్తుంది. దీని అర్థం ఐక్యూ నియో 10 కొద్దిగా చిన్న బ్యాటరీ ఉన్నప్పటికీ వేగంగా ఛార్జ్ అవ్వగలదు!

పోకో ఎఫ్7 వర్సెస్ ఐక్యూ నియో 10: ధర..

పోకో ఎఫ్7 ధర 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 31,999, 12జీబీ ర్యామ్​- 512GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 33,999గా ఉంది. ఈ డివైజ్ మూడు కలర్​ ఆప్షన్స్​లో వస్తుంది. అవి.. సైబర్ సిల్వర్ ఎడిషన్, ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్.

ఐక్యూ నియో 10 బేస్ మోడల్ 8జీబీ ర్యామ్​ 128జీబీ స్టోరేజ్ ధర రూ. 31,999, 8జీబీ ర్యామ్​ 256జీబీ స్టోరేజ్ ధర రూ. 33,999, 12జీబీ + 256జీబీ ధర రూ. 35,999, హై-ఎండ్ 16జీబీ + 512జీబీ వేరియంట్ ధర రూ. 40,999. ఈ డివైజ్ రెండు కలర్​ ఆప్షన్స్​తో వస్తుంది: ఇన్ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.