సన్ రైజర్స్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రావుతోపాటు హెచ్‌సీఏ సభ్యులను సీఐడీ అరెస్ట్ చేసింది.
ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ వారిని అరెస్ట్ చేసింది.హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదాలో సన్ రైజర్స్‌ను జగన్మోహన్ రావు బెదిరించారని.. 20శాతం ఫ్రీగా టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌లో వీఐపీ గ్యాలరీకి తాళాలు వేయడంపై సీరియస్ అయిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం.
































