ఇక రోజులు లెక్కపెట్టుకోండి.. మంత్రులకు CM చంద్రబాబు హెచ్చరిక

పనితీరు సరిగా లేని మంత్రు(AP Ministers)లకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) వార్నింగ్ ఇచ్చారు. బుధవారం అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్త వాళ్లు వస్తారంటూ మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగా నడిచేవి అని అన్నారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. అంతా విపక్షాల దుష్ప్రచారమే అని చెప్పారు. తప్పుడు ప్రచారాలను మంత్రులు సకాలంలో తిప్పికొట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని అన్నారు. విపక్షాల ప్రచారాన్ని ఎప్పటికప్పుడే తిప్పికొట్టాలని అన్నారు.

లేకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. మహిళలపైనా వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. లేదంటే.. ఇక మంత్రులు రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.