ఏపీ కేబినెట్(Ap Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయం(Secretariat)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
అమరావతి(Amaravati)లో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుతో పాటు 2022లో దారుణ హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం వంటి అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇంటి పెద్దను కోల్పోయిన తోట చంద్రయ్య కుటుంబానికి భారీ రిలీఫ్ లభించినట్లైంది.
కాగా గత ప్రభుత్వ హయాంలో తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. పల్నాడు జిల్లా(Palnadu District) వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్య టీడీపీలో యాక్టివ్‌గా పని చేసేవారు.. అయితే వెల్దుర్తి ఎంపీపీ అక్రమాలపై తోట చంద్రయ్య పోరాటం చేసే వారు. ఈ క్రమంలో తోట చంద్రయ్య 2022, జనవర 13న గ్రామంలో బైక్‌పై వెళ్తుండగా కత్తులతో దాడులకు పాల్పడ్డారు. జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా వినకుండా జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. దీంతో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. తోట చంద్రయ్య పాడె మోసి నివాళులర్పించారు. ఆ సమయంలో తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు.
































