ఆఫీసులో కూర్చుని కూర్చుని మెడ, వెన్నె నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా

ఆఫీసులో విధులు నిర్వహించే వారు నిరంతరం కుర్చీలో కూర్చుని ఉంటారు. విశ్రాంతి లేకుండా నిరంతరం కూర్చోవడం వల్ల మెడ, వీపు, భుజాలు బిగుసుకుపోవడం సర్వసాధారణం. అపుడు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే నిరంతరం ఆఫీసులో కూర్చుని ఉండడం వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడం కష్టం కాదు. సీటులో కూర్చొని ఈ సింపుల్ యోగాసనాలు చేయడం వలన ఉపశమనం మీ సొంతం అవుతుంది. రోజంతా చురుకుగా ఉండేలా చేస్తాయి.

ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని కంప్యూటర్ ముందు పని చేయాల్సి ఉంది. ఇలా ఆఫీసులో ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం వల్ల శరీరానికి అలసట కలగడమే కాదు హాని కూడా కలుగుతుంది. ముఖ్యంగా మెడ, వీపు, భుజాలు, నడుములో దృఢత్వం, బిగుతు, తేలికపాటి నొప్పి అనుభూతి చెందడం సర్వసాధారణం. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం ఇచ్చే పరిష్కారం కూడా అంతే సులభం. ఆఫీసు కుర్చీపై కూర్చున్నప్పుడు కొన్ని సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. ఈ యోగాసనాల వలన కండరాల దృఢత్వాన్ని తగ్గించడమే కాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రోజంతా శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.


ఈ సింపుల్ యోగాసనాలు వెన్నెముకను నిటారుగా ఉంచడంతో పాటు భుజాలను రిలాక్స్ గా చేయడం, అలసట నుంచి ఉపశమనం పొందడంలో చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. కనుక ఆఫీసు లో కూర్చుని కూర్చుని ఇబ్బంది పడుతుంటే.. రిలాక్స్ కోసం కాఫీ, టీలకు బదులుగా.. ఈ సింపుల్ యోగాసనాలను ప్రయత్నించండి

రోజంతా ల్యాప్‌టాప్ లేదా స్క్రీన్‌ ను చూడడం వలన మెడ కండరాలు బిగుసుకుపోతాయి. అటువంటి పరిస్థితిలో, “నెక్ రొటేషన్ స్ట్రెచ్” చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిటారుగా కూర్చుని నెమ్మదిగా తలను కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు తిప్పండి. తర్వాత తేలికగా ముందుకు, వెనుకకు వంగండి. ఈ స్ట్రెచ్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. అయితే ఈ సమయంలో మెడను అతిగా తిప్పకుండా జాగ్రత్త వహించండి. ప్రతి కదలికను నెమ్మదిగా, నియంత్రణతో చేయండి. దీన్ని రోజుకు 2–3 సార్లు పునరావృతం చేయండి. తేడా మీకే తెలుస్తుంది.

ఆఫీసులో నిరంతరం టైప్ చేయడం వల్ల భుజాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో “భుజం రోల్స్” అంటే భుజాలను వృత్తాకార కదలికలో తిప్పే వ్యాయామం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మొదట రెండు భుజాలను ముందుకు, తరువాత వెనుకకు తిప్పండి. ఇలా 10-10 సార్లు చేయండి. ఈ భుజం రోల్స్.. భుజాలపై ఒత్తిడిని తొలగించడమే కాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. భుజాలు చురుగ్గా ఉంటాయి. భుజ భారం కూడా తగ్గుతుంది.

“సీటెడ్ స్పైన్ ట్విస్ట్” అనేది వెన్నెముకను సరళంగా, బలంగా ఉంచడానికి చాలా ఉపయోగకరమైన స్ట్రెచ్. నిటారుగా కూర్చోండి.. వీపు నిటారుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ నడుము వంచి ఒక వైపుకు తిరిగి, ఒక చేతితో వెనుక భాగాన్ని పట్టుకుని కొన్ని సెకన్ల పాటు అలా ఉండండి. తర్వాత మరొక దిశలో పునరావృతం చేయండి. ఈ స్ట్రెచ్ నడుము నొప్పిని తగ్గిస్తుంది. శరీర భంగిమను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఎక్కువ సేపు కూర్చోడం వలన కలిగే వచ్చే వెన్నెముకపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ల్యాప్‌టాప్‌లో నిరంతరం టైప్ చేయడం వల్ల చేతులు, వేళ్లు , మణికట్టు అలసిపోతాయి. “హ్యాండ్ స్ట్రెచ్” వాటికి కొత్త శక్తిని తెస్తుంది. అరచేతిని ముందు చాచి మరో చేత్తో వేళ్లను మెల్లగా వెనుకకు లాగండి. తర్వాత మణికట్టును తిప్పండి. ఇది నరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. టైప్ చేసే లేదా గంటల తరబడి మౌస్‌ని ఉపయోగించే వారికి ఈ స్ట్రెచ్ చాలా ముఖ్యం. రోజుకు 2-3 సార్లు చేయండి.

కుర్చీపై కూర్చున్నప్పుడు “లెగ్ ఎక్స్‌టెన్షన్” చేయడం ద్వారా కాళ్ల కండరాలను చురుగ్గా ఉంచుకోవచ్చు. నిటారుగా కూర్చోండి, నెమ్మదిగా ఒక కాలును ముందుకి నిటారుగా చేసి, కొన్ని సెకన్ల పాటు పట్టుకుని, తర్వాత దానిని క్రిందికి తీసుకురండి. మరొక కాలుతో కూడా అదే పునరావృతం చేయండి. ఈ సాగదీయడం వల్ల తొడలకు కలిగే ఇబ్బంది తొలగిపోతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్లకు ఉపశమనం లభిస్తుంది.

ఆఫీసులో తరచుగా విశ్రాంతి తీసుకోవడం కష్టమైతే.. “పిల్లి-ఆవు భంగిమ” చేయండి. కూర్చున్నప్పుడు పిల్లి భంగిమలో ఉండి… ఆపై దానిని క్రిందికి వంచండి (ఆవు భంగిమ). ఈ సాగదీయడం వల్ల వెన్నెముకకు వశ్యత వస్తుంది. వెన్నునొప్పి త్వరగా తగ్గుతుంది. ఇది చిన్నది కానీ ప్రభావవంతమైన యోగాసననం. ఇది అలసటను క్షణంలో తొలగించగలదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.