ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం….జనగణనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రచురించింది.


2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్రహోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. ఇకపోతే ఈసారి నిర్వహించే జనగణన కోసం కేంద్రం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయనుంది. ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాలు, ఆస్తుల వివరాలను అందులో నమోదు చేయనున్నారు.

జనగణనకు ప్రభుత్వం పచ్చజెండా
రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్‌ను గురువారం తిరిగి ప్రభుత్వం ప్రచురించింది. 16వ జనాభాలెక్కల సేకరణను డిజిటల్ యాప్‌ల ద్వారా చేపట్టనుంది. ఉపాధ్యాయులు, స్వీయధ్రువీకరణతో ప్రజలే వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి ఈ సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.