సంతూర్, మైసూర్ శాండల్ వాడితే మీ పని ఖతమే.. అసలు ఏ సోప్ వాడాలో తెలుసా?

 నవజాత శిశువుల చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. అందుకే వారి సంరక్షణ కోసం శిశువు ఉత్పత్తులను ఎంచుకునే ముందు నాణ్యతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.


మీరు మీ బిడ్డకు మంచి నాణ్యమైన హెయిర్ షాంపూ, పౌడర్, సోప్, లోషన్, హెయిర్ ఆయిల్ వంటివి కూడా చాలా నాణ్యమైనవి ఎంచుకోవాలి. అప్పుడే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకీ పిల్లలకు సూట్ అయ్యే మంచి సోప్ ఏంటి? అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.

చాలా మంది పిల్లలకు కూడా సింతాల్, మైసూర్ సాండిల్ సోప్, రెక్జొనా వంటివి పెట్టాలి అనుకుంటారు. కానీ శిశువులకు ఇలాంటి సోప్స్ అసలు ఉపయోగించవద్దు అంటున్నారు నిపుణులు. వారికి కేవలం బేబీ ప్రొడక్ట్స్ ను మాత్రమే ఉపయోగించాలి. మీరు తీసుకునే సబ్బులో రసాయన నాణ్యత ఉండకూడదు. అప్పుడే వినియోగదారులు వాటిని ఇష్టపడతారు. అలాంటివి మాత్రమే వారి స్కిన్ ను మంచిగా, మృదువుగా ఉంచుతాయి. ప్రస్తుతం మార్కెట్లో వేలాది బేబీ సబ్బులు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రతి సబ్బు వారి చర్మానికి సరైనది కాదు. కొన్ని బేబీ సబ్బులు పిల్లల సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి. దద్దుర్లు, చికాకు, దురదను కలిగిస్తాయి.

కానీ పిల్లలకు సబ్బు కొనేటప్పుడు లేబుల్‌ని జాగ్రత్తగా చదివి తీసుకోవాలి. ఆ సబ్బు మీ పిల్లల చర్మానికి సరైనదా కాదా అని తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు. అయితే ముఖ్యంగా పిల్లలకు పియర్స్, డవ్ వాడాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి PH స్థాయిని సరిగ్గా మెయింటెన్ చేస్తాయి అని సూచిస్తున్నారు. స్కిప్ PH ని, సోప్ PH ని ఈక్వెల్ చేస్తాయట. ఇక శిశువులకు, టీనేజ్ పిల్లలకు, పెద్ద వారికి వేరు వేరు సబ్బులను ఉపయోగించడం చాలా అవసరం. ఈ PH వాల్యూను కూడా చూసి తీసుకోవాలి. పిల్లల సోప్స్ లో చాలా తక్కువ స్థాయిలో PH ఉంటుంది.

ఇక మీ శిశువు పెరుగుతన్న సమయంలో వారికి డవ్, పీయర్స్ వంటి సోప్ లను అలవాటు చేయవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ చంటి పిల్లలకు మాత్రం చాలా మంచి ఉత్పత్తులనే ఎంచుకోవాలి. బేబీ సోప్స్ లో సెటాఫిల్ బేబీ సోప్స్ వంటివి మంచివని సూచిస్తున్నారు నిపుణులు. సోప్ విషయంలో మాత్రమే కాదు, మాయిశ్చరైజర్, లోషన్, ఆయిల్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.