బెల్లం ఫేస్‌ వాష్‌..దెబ్బకు ముఖంపై ముడతలు మాయం.

వంటింట్లో ఉపయోగించే వాటితో ముఖానికి సంబంధించిన సమస్యలను సులభంగా మటు మాయం చేసే టెక్నిక్‌లు, చిట్కాలు చూశాం. కానీ ఆరోగ్యానికి మంచిదని చెప్పే బెల్లం చర్మ సంరక్షణకు తోడ్పడుతుందని విన్నారా..?.


ఔను బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్‌ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించనియ్యదు.

చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాలటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ లేదా అలోవెరా జెల్‌ రాసుకోవాలి.

ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.