రెడ్ వైన్. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరమైన అంశాల్లో తరచూ ఈ రెడ్ వైన్ గురించి ప్రస్తావన వస్తోంది. రెడ్ వైన్ పరిమితంగా తీసుకోటం ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెప్పటమే ఇందుకు ప్రధాన కారణం.
రెడ్ వైన్‌లో మన శరీరానికి ఉపయోగపడే అనేక సమ్మేళనాలు ఉంటాయి. తద్వారా ఆరోగ్య పరమన ప్రయోజనాలు అందుతాయి. అయితే, అసలు ఈ రెడ్ వైన్ ఎప్పుడు తీసుకోవాలి..ఎంత మోతాదులో తీసుకోవాలనేది కీలక అంశం.
రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రెస్వెరెట్రాల్, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కాటెకిన్స్, ప్రో ఆంథో సయనైడిన్స్ కూడా రెడ్ వైన్‌లో ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారిస్తుంది. వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన రెస్వెరెట్రాల్, పాలిఫినాల్స్ రక్త నాళాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేట్లు చేస్తాయి. ఫలితంగా రక్త నాళాల్లో ఉండే క్లాట్స్ కరిగిపోతాయి. రక్త నాళాల వాపులు సైతం తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
రెడ్ వైన్‌ను సేవిస్తుంటే శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రెడ్ వైన్ ఎంతగానో మేలు చేస్తుంది. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం కారణంగా ఈ వైన్ ను సేవిస్తుంటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్ వంటి క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు జీర్ణశక్తి మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. కాగా, రెడ్ వైన్‌ను వారంలో 2 సార్లు తాగవ చ్చని, ఒక్కోసారి 150 ఎంఎల్ వరకు సేవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా తాగ డం వల్ల లాభాలే ఉంటాయని అంటున్నారు.
































