‘మాతృభాష అమ్మైతే.. హిందీ పెద్దమ్మ’.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

 ‘ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజు ఏకం కావడానికి ఒక రాజ్య భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయింది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​పేర్కొన్నారు.


ఈ రోజు ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తో పాటు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒక బెంగాలీ గీతం జాతీయ గీతం అయ్యింది, ఒక పంజాబీ భగత్ సింగ్ దేశం కోసం పోరాడే విప్లవకారుడు అయ్యాడు, రాజస్థాన్ కి చెందిన రాణాప్రతాప్ సౌర్యానికి చిహ్నం అయ్యారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఇండియా అయ్యారు, మద్రాస్ ప్రెసిడెన్సీ, ద్రవిడ ప్రాంతంలోనున్న ఒకరు చేసిన మువ్వన్నెల జెండా దేశానికి తిరంగా అయింది.

అని ఆయన పేర్కొన్నార. ప్రతీ భాషా జీవ భాష, మాతృ భాష. కానీ రాజ్య భాష మాత్రం హిందీ అని ఆయన పేర్కొన్నారు. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృ భాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీ ఉందన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, దేశంలోని ఇతరత్రా అన్ని భాషలు కావొచ్చు మన మాతృ భాష మీద మనకి గౌరవం ఉంటుంది, మన మాతృ భాష అమ్మైతే మన పెద్దమ్మ భాష హిందీ అని అన్నారు. విద్యా, వైద్యం, వ్యాపారం, ఉపాధి కోసం అన్ని భాషలు, మాండలికాలు అవధులను చేయించుకుంటూ వెళ్లిపోతున్నాయి. ఇలాంటి సమయంలో హిందూ వద్దు అనుకోవడం, వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లు అవుతుందని పవన్​అభిప్రాయపడ్డారు.

మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్లు కాదు, మనం మరింత బలపడటం అన్నారు. ఇంకొక భాషని అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చెయ్యడం అని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వలనే కదా ఐటీ రంగంలో అందిపుచ్చుకోగలిగాం.అలాంటిది దేశం మొత్తం మీద ఎక్కువ శాతం జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టం వచ్చే పరిస్థితి ఏం లేదన్నారు. ఉదాహరణకు సినిమాల పరంగా చూసుకుంటే సౌత్ ఇండియన్ సినిమాలలో 31% శాతం సినిమాలు హిందీలో డబ్ అయ్యి ఆదాయం వస్తుంది. ఇలా వ్యాపారాలకు హిందీ కావాలి, నేర్చుకోవడానికి మాత్రం హిందీతో ఇబ్బందేంటి అని ఆయన ప్రశ్నించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.