అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెడుతున్నారా..? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

న్నం వండే ముందు కనీసం తద్వారా మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. అంతేకాదు డయాబెటీస్‌ రాకుండా గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువ అవుతుంది. బియ్యం ఇలా నానబెట్టడం వల్ల పోషకాలు గ్రహిస్తాయని చెబుతున్నారు.


బియ్యం నానబెట్టడం వల్ల త్వరగా అన్నం ఉడుకుతుంది. మెలోటినోన్‌ ఉత్పత్తికి కూడా ఇది ప్రేరేపిస్తుంది తద్వారా మంచి నిద్ర పడుతుంది. కనీసం 20 నిమిషాలు అయినా వండే ముందు బియ్యం నానబెట్టాలి. తద్వారా ఖనిజాలు, విటమిన్లు కూడా నీటిలో గ్రహించబడతాయి.

ఆధునిక వ్యవసాయంలో వరి సాగులో ఎన్నో రకాల పురుగుమందులు వాడుతున్నారు. కాబట్టి, అన్నం వండేముందు బియ్యం నానబెట్టి, ఆ నీటిని వడపోయడం ద్వారా బియ్యం ఉపరితలంపై అంటుకుని ఉన్న కొన్ని రసాయనాలు, దుమ్ము వంటివి తొలగిపోతాయని చెబుతున్నారు.

అన్నం వండేముందు బియ్యాన్ని నానబెట్టడం వల్ల షుగర్‌ ఉన్నవారికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా నానబెట్టిన బియ్యం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్​లో ఉంచే.. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ ఏర్పడుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్​ స్కోర్​ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

బియ్యం నానబెట్టి వండటం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఆహారంలో పోషకాల శోషణ మెరుగుపడుతుందంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.